పులివెందులపై చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారిస్తారు

ABN , First Publish Date - 2021-12-27T05:16:48+05:30 IST

ఈసారి పరిపాలన ఎలా చేయాలో కుప్పంలో జరిగిన సంఘటనను బట్టి చంద్రబాబుకు కూడా తెలిసొచ్చిందని, గతంలో మాదిరి ఉండదని, పులివెందులపై ప్రత్యేక దృష్టిసారిస్తారని ఎమ్మెల్సీ బీటెక్‌ రవి పేర్కొన్నారు.

పులివెందులపై చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారిస్తారు
వేంపల్లె టీడీపీ సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ బీటెక్‌ రవి

ఎమ్మెల్సీ బీటెక్‌ రవి 

వేంపల్లె, డిసెంబరు 26: ఈసారి పరిపాలన ఎలా చేయాలో కుప్పంలో జరిగిన సంఘటనను బట్టి చంద్రబాబుకు కూడా తెలిసొచ్చిందని, గతంలో మాదిరి ఉండదని, పులివెందులపై ప్రత్యేక దృష్టిసారిస్తారని ఎమ్మెల్సీ బీటెక్‌ రవి పేర్కొన్నారు. వైసీపీపై పులివెందులలోని పల్లెల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. రాబోయే కాలంలో అధికారం టీడీపీదేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. వేంపల్లెలోని కాటా రామయ్య ఫంక్షన్‌ హాల్‌లో ఆదివారం మండల టీడీపీ కార్యకర్తల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ సతీష్‌రెడ్డి టీడీపీకి రా జీనామా చేయడం, ఆయన లేకుండా సమావేశం జరుపుకోవడం బాధాకరంగా ఉందన్నారు. సతీష్‌రెడ్డిని మళ్లీ టీడీపీలోకి తెచ్చు కునేందుకు యత్నిద్దామని ఆయన కోరారు. జగన్‌ పాలనపై తీవ్ర అసంతృప్తి ఉందని, వచ్చే ఎన్నికల్లో వందశాతం టీడీపీ విజయం ఖాయమన్నారు. పులివెందులలో పార్టీని బలోపేతం చేసేందుకు కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. జనవరి నెలలో పులివెందుల కార్యకర్తలతో బాబు ముఖాముఖి పాల్గొం టారని, ఆ కార్యక్రమానికి హాజరుకావాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం మైనార్టీ కార్పొరేషన్‌ షబ్బీర్‌ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ బీటెక్‌ రవిని శాలువ, పూలమాలలతో సత్కరించారు. గ్రంథాలయ మాజీ చైర్మన్లు బాలస్వామిరెడ్డి, మునిరెడ్డి, రైతు విభాగం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జగన్నాథరెడ్డి, తిప్పారెడ్డి, ఆర్వీరమేష్‌, నల్లగారి కృష్ణారెడ్డి, గండి మాజీ చైర్మన్‌, రాజారావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-27T05:16:48+05:30 IST