పీఠాధిపతి శివైక్యం తీరనిలోటు : పుట్టా
ABN , First Publish Date - 2021-05-09T04:55:35+05:30 IST
పోతులూరు వీరబ్ర హ్మేంద్రస్వామి ఆల యం పీఠాధిపతి వీర భోగవసంత వెంకటేశ్వ ర స్వామి శివైక్యం పొందడం భక్తులకు తీరని లోటని టీటీడీ మాజీ ఛైర్మన్ పుట్టా సుధాకర్‌యాదవ్ పేర్కొన్నారు.

మైదుకూరు, మే 8: పోతులూరు వీరబ్ర హ్మేంద్రస్వామి ఆల యం పీఠాధిపతి వీర భోగవసంత వెంకటేశ్వ ర స్వామి శివైక్యం పొందడం భక్తులకు తీరని లోటని టీటీడీ మాజీ ఛైర్మన్ పుట్టా సుధాకర్‌యాదవ్ పేర్కొన్నారు. బ్రహ్మంగారి కాలజ్ఞానంపై భక్తులకు ఓర్పుతో వివరించి చెప్పడం ఆయన నైజమన్నారు. వారి కుటుంబాని కి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఆప్యాయంగా పలకరించేవారు : రెడ్యం
బ్రహ్మంగాఠం, మే 8: కాలజ్ఞానకర్త మద్విరాట్ పోతులూరి వీరబ్ర హ్మేంద్రస్వామి దేవస్థానం పీఠాధిపతి వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి శివైక్యం పొందడం బాధాకరమని టీడీపీ రాష్ట్ర కార్యని ర్వాహక కార్యదర్శి రెడ్యం వెంకటుబ్బారెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అందరినీ ఆప్యాయంగా పలుకరించే పీఠాధిపతి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.