ఛైర్మన్‌ గారూ... సభ్యత సంస్కారం నేర్చుకోండి : టీడీపీ

ABN , First Publish Date - 2021-07-09T05:00:26+05:30 IST

పాలకవర్గంలో సంగం మంది మహిళలే ఉన్నారు, ప్రధమ పౌరుడివి మహిళలతో ఎలా మాట్లాడాలో సభ్యత సంస్కారం నేర్చుకో అంటూ టీడీపీ కౌన్సిలర్లు మున్సిపల్‌ ఛైర్మన్‌ మాచనూరు చంద్రపై విరు చుకుపడ్డారు.

ఛైర్మన్‌ గారూ... సభ్యత సంస్కారం నేర్చుకోండి : టీడీపీ

మైదుకూరు, జూలై 8: పాలకవర్గంలో సంగం మంది మహిళలే ఉన్నారు, ప్రధమ పౌరుడివి మహిళలతో ఎలా మాట్లాడాలో సభ్యత సంస్కారం నేర్చుకో అంటూ టీడీపీ కౌన్సిలర్లు మున్సిపల్‌ ఛైర్మన్‌ మాచనూరు చంద్రపై విరు చుకుపడ్డారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో గురువారం సాయంత్రం వారు విలేకరులతో  మాట్లాడుతూ కోఆప్షన్‌ సభ్యుల ఎన్నికలో ఎమ్మెల్యే సమక్షంలోనే మహిళలను అవమానిస్తూ, అగౌరవపరిచేలా మాట్లాడారు.

ఎక్కడైనా  ప్రతిపక్షం అనేది ఉంటేనే అభివృద్ధి జరుగుతుంది. టీడీపీ ప్రభుత్వంలో వేసిన 12 బోర్లకు 24 లక్షలు కాకున్నా మూ డు నెలల్లోనే వాటి మరమతులకు 24 లక్షలు ఖర్చుపెట్టా మంటున్నారు. రేషన్‌ బియ్యం ఇవ్వడం లేదని ఓ మహిళ అరోపిస్తే వారి ఇంట్లోకి వెళ్లి దాడి చేసి బెదిరించారని ఆరో పించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు బీఎన్‌ నాగేశ్వరి, సులో చన, ధనపాల భారతి, కుర్రారాధ, వెంకటసుబ్బారెడ్డి, అమీర్‌బాష,  తదదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-07-09T05:00:26+05:30 IST