వైసీపీ నేతలపై కేసు నమోదు

ABN , First Publish Date - 2021-10-20T05:20:04+05:30 IST

టీడీపీ నాయకుడు అమీర్‌బాబు ఇంటి ముందు ధర్నా చేసిన పది మంది వైసీపీ నేతలపై కేసు నమోదు చేశామని కడప వన్‌టౌన్‌ ఎస్‌ఐ సుధాకర్‌ తెలిపారు.

వైసీపీ నేతలపై కేసు నమోదు

కడప(క్రైం), అక్టోబరు 19 : టీడీపీ నాయకుడు అమీర్‌బాబు ఇంటి ముందు ధర్నా చేసిన పది మంది వైసీపీ నేతలపై కేసు నమోదు చేశామని కడప వన్‌టౌన్‌ ఎస్‌ఐ సుధాకర్‌ తెలిపారు. ముఖ్యమంత్రిని ముస్లిం వ్యతిరేకిగా చిత్రీకరిస్తూ టీడీపీ నేత అమీర్‌బాబు వ్యాఖ్యలు చేశారని, దీనికి నిరసనగా మంగళవారం ఆయన ఇంటిముందు వైసీపీ నాయకులు జాషువా, గరుడాద్రి, మరి కొందరు ధర్నా చేయడంతో వారిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అనుమతి లేకుండా ధర్నా చేస్తూ ప్రజలకు ఇబ్బందులు కలిగించడంతో ఈ మేరకు వైసీపీ నాయకులపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు తెలిపారు.

 

Updated Date - 2021-10-20T05:20:04+05:30 IST