ఎర్రచందనం దుంగలు స్వాధీనం

ABN , First Publish Date - 2021-12-07T05:37:49+05:30 IST

అక్రమంగా తరలిపోతున్న ఎర్రచందనం దుంగలను సోమవారం రైల్వేకోడూరు రేంజి పరిధిలో పట్టుకుని, ముగ్గురు స్మగ్లర్లను అరెస్టు చేశారు. రైల్వేకోడూరు సబ్‌ డీఎ్‌ఫవో ధర్మరాజు, రేంజర్‌ నయీమ్‌ఆలీ కథనం మేరకు...రైల్వేకోడూరు అటవీశాఖ రేంజి పరిధిలో ఓబులవారిపల్లె మండలం వై.కోట గ్రామం గుండాలేరు ప్రదేశంలో ముగ్గురు వ్యక్తులు అక్రమంగా 6 ఎర్రచందనం దుంగలను తరలిస్తుండగా దాడులు చేసి పట్టుకున్నారు.

ఎర్రచందనం దుంగలు స్వాధీనం
పట్టుకున్న ఎర్రచందనం దుంగలు, అరెస్ట్‌ అయిన స్మగ్లర్లతో పోలీసులు

ముగ్గురు స్మగ్లర్ల అరెస్టు

రైల్వేకోడూరు, డిసెంబరు 6: అక్రమంగా తరలిపోతున్న ఎర్రచందనం దుంగలను సోమవారం రైల్వేకోడూరు రేంజి పరిధిలో పట్టుకుని, ముగ్గురు స్మగ్లర్లను అరెస్టు చేశారు. రైల్వేకోడూరు సబ్‌ డీఎ్‌ఫవో ధర్మరాజు, రేంజర్‌ నయీమ్‌ఆలీ కథనం మేరకు...రైల్వేకోడూరు అటవీశాఖ రేంజి పరిధిలో ఓబులవారిపల్లె మండలం వై.కోట గ్రామం గుండాలేరు ప్రదేశంలో ముగ్గురు వ్యక్తులు అక్రమంగా 6 ఎర్రచందనం దుంగలను తరలిస్తుండగా దాడులు చేసి పట్టుకున్నారు. చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం కుమ్మరమిట్టకు చెందిన యానాది భాస్కర్‌, రైల్వేకోడూరు మండలం శెట్టిగుంట పంచాయతీలోని గిరిజన కాలనీకి చెందిన మేకల నగేష్‌, ఓబులవారిపల్లె మండలం బాలిరెడ్డిపల్లెకు చెందిన సరికంటి తారక అనే స్మగ్లర్లను అరెస్ట్‌ చేసి రైల్వేకోడూరు కోర్టులో హాజరుపరిచినట్లు అటవీ శాఖాధికారులు తెలిపారు. దుంగలు 95 కిలోల బరువు ఉన్నాయని తెలిపారు. స్మగ్లర్ల నుంచి ఒక మొబైల్‌ ఫోన్‌, ఒక బజాజ్‌ ప్లాటినా బైక్‌ను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ దాడుల్లో బాలుపల్లె సెక్షన్‌ డిప్యూటీ రేంజర్‌ ఎం. మహే్‌షకుమార్‌, కేవీబావి సెక్షన్‌ ఎఫ్‌ఎ్‌సవో ఎస్‌.బాబాసాహెబ్‌, ఎఫ్‌బీవోలు ఎం.జనార్ధన్‌, కె.విజయక్రిష్ణ, ఏబీవో ఎం.నాగేశ్వరనాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-07T05:37:49+05:30 IST