బద్వేలుకు బైపాస్‌ కలేనా..?

ABN , First Publish Date - 2021-08-22T05:11:53+05:30 IST

బద్వేలు పట్టణ జనాభా లక్షకు దా టి, వాహనాల సంఖ్య పెరిగినా బై పాస్‌ రోడ్డుకు మార్గం కనబడడం లేదు. కృష్ణపట్నం వెళ్లాలన్నా ఇదే జాతీయ రహదారి ప్రధానం కావ డంతో అతిభారీ, భారీ వాహనాలు సైతం పట్టణం నడిబొడ్డు నుంచే వెళుతున్నాయి.

బద్వేలుకు బైపాస్‌ కలేనా..?
బద్వేలు పట్టణ నాలుగు రోడ్ల కూడలి ఫైల్‌

అతిభారీ వాహనాలకూ ఇదే రహదారి

నిత్యం ప్రమాదాల బారిన పట్టణం

వాహనాల రద్దీతో వెంటాడుతున్న ఇక్కట్లు

బద్వేలు రూరల్‌, ఆగస్టు 21: బద్వేలు పట్టణ జనాభా లక్షకు దా టి, వాహనాల సంఖ్య పెరిగినా బై పాస్‌ రోడ్డుకు మార్గం కనబడడం లేదు. కృష్ణపట్నం వెళ్లాలన్నా ఇదే జాతీయ రహదారి ప్రధానం కావ డంతో అతిభారీ, భారీ వాహనాలు సైతం పట్టణం నడిబొడ్డు నుంచే వెళుతున్నాయి.

దీంతో నిత్యం ఎక్క డో ఒక చోట ప్రమాదాలు జరిగి ప్రజల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. 20 ఏళ్లగా బద్వేలుకు బైపాస్‌ వస్తుందని అనుకుంటు న్నా ఇంత వరకూ మంజూరు కాకపోవడం తో అదికలగానే మిగిలిపోనుందని పట్టణ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలో వాహనదారులకు పార్కింగ్‌ స్థలంపై ఆరోపణలు విన్పిస్తున్నాయి. వివరాల్లోకెళితే.. 

 పంచాయతీగా 30వేల జనాభాతో ఉన్న బ ద్వేలు పట్టణం 2008లో మున్సిపాలిటీగా పు రోగతి చెందింది. కాలక్రమేణా గ్రామీణులు పట్టణానికి వచ్చి చేరుతుండడంతో పట్టణ జనాభా సంఖ్య లక్షకు దాటింది. అధిక జనా భా దామాషా ప్రకారం టూవీలర్‌, ఫోర్‌వీలర్లు కూడా ఎక్కువగానే తిరుగుతున్నాయి. ప్రధానంగా జాతీయ ప్రధాన రహదారి కావ డమే పట్టణానికి శాపంలా మారింది. బద్వే లు మీదుగా చాలా ప్రాంతాల నుంచి భారీ వాహనాలు కృష్ణపట్నం పోర్టుకు వెళుతుం టాయి.
ఒక్కో పర్యాయం 36 టైర్ల వాహనా లు పెద్ద పెద్ద కంటైనర్లతో వెళ్లాలంటే ట్రాఫి క్‌ స్తంభిస్తుంటోంది. దీంతో పట్టణానికి బైపా స్‌ రోడ్డు ఎంతో అవసరమని అధికారులకు ప్రజాప్రతి నిధులు తేల్చారు. పట్టణానికి బైపాస్‌ రోడ్డు వస్తుందంటూ అంటున్నా కా ర్యరూపం దాల్చడంలేదు. 20 ఏళ్లగా రెండు మూడు దఫాలు కొలతలు వేశారు. ఈవిష యంలో ప్రజాప్రతినిధులు, అధికారులు మాటదాటేస్తున్నారు.

పెరిగిన రోడ్డు ప్రమాదాలు

 కృష్ణపట్నం పోర్టుకు వెళ్లే వాహనాలు బద్వేలు నుంచే వెళ్లాలి. భారీ, అతిభారీ వాహనాలు వెళ్లేందు కు, మలుపులు తిరిగేందుకు సరై న అవకాశం లేకపోవడంతో ఎ న్నో రోడ్డు ప్రమాదాలు చోటుచే సుకుని ఎందరో ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయి న సందర్భాలున్నాయి.  ఇటీవల గ్రామీణ వాహనదారులు, పాదచారులు రోడ్డు ప్రమాదాలకు గురై ప్రాణా లు కోల్పోయారు. నెలరోజులుగా పరిశీలిస్తే దాదాపు పట్టణ శివారు ప్రాంతాల్లో నాలుగైదు ప్రమాదాలు జరిగి ఏడెనిమిది మంది ప్రాణాలు కోల్పోవడం ఆవేదన కలిగించే విషయం.

పట్టణంలో ప్రధాన రహదారుల్లోనే దుకాణా లు ఉండడం, గ్రామీణ, పట్టణ ప్రజలు వ్యక్తిగత అవసరాలకు వచ్చి పోతుండడం భారీ వాహనాలు వెళుతుండడంతో ఎక్కడ ఏ ప్రమాదం జరుగుతుందో ఆందోళన చెందాల్సిన పరిస్థితి దాపురించింది. జరిగిన రోడ్డు ప్రమాదాలు దృష్టిలో ఉంచుకుని ఇకనైనా ప్రజా ప్రతినిధులు బైపాస్‌ రోడ్డు మంజూరు చేయించేందుకు చర్యలు చేపట్టాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

పార్కింగ్‌ స్థలం ఏర్పాటు చేయాలి

 పట్టణంలోని నాలుగు ప్రధాన రహదారు ల్లో వ్యక్తిగత అవసరాలకు పట్టణ ప్రజలు నిత్యం తిరగాల్సిందే. ఏదైనా దుకాణం వద్ద వాహనాన్ని నిలపాలన్నా పార్కింగ్‌ అవసర మే. అన్నిచోట్లా పార్కింగ్‌ స్థలం లేకపోగా ఉ న్నచోట్ల కనీసం బైకు పట్టేమైన స్థలం కూడా లేదని పలువురు ఆరోపిస్తున్నారు. పార్కింగ్‌ విషయంలో పోలీసులతో ఇబ్బందులు తప్ప డంలేదు. పట్టణంలో పార్కింగ్‌ ఏర్పాటు చే యించాలని వాహనదారులు కోరుతున్నారు. 

Updated Date - 2021-08-22T05:11:53+05:30 IST