గంజాయి ముఠా అరెస్టు
ABN , First Publish Date - 2021-07-24T05:58:37+05:30 IST
గంజాయిని విశాఖపట్టణం నుంచి తీసుకొచ్చి జిల్లాలో విక్రయించే అయిదుగురు ముఠా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 260 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.

260 కిలోల గంజాయి స్వాధీనం
వివరాలు వెల్లడించిన ఎస్పీ కేకేఎన అన్బురాజన
కడప(క్రైం), జూలై 23: గంజాయిని విశాఖపట్టణం నుంచి తీసుకొచ్చి జిల్లాలో విక్రయించే అయిదుగురు ముఠా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 260 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ కేకేఎన అన్బురాజన ఓఎస్డీ దేవప్రసాద్ తో కలసి శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించి నిందితుల వివరాలు వెల్లడించారు. విశాఖపట్టణం జిల్లా రోలుగుంట్ల మండలం బెన్నభూపాలపట్నం గ్రామానికి చెందిన కాడె రాము ట్రాక్టరు డ్రైవరుగా జీవనం సాగిస్తున్నాడు. జల్సాలకు అలవాటు పడ్డ ఇతను ఈజీ మనీ కోసం గంజాయి అక్రమ రవాణాకు దిగాడు. ఇదే జిల్లా నర్సిపట్నం మండలం వేములపురి గ్రామానికి చెందిన చిటికెల తేజ కారు డ్రైవరుగా పనిచేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన కొత్తపల్లె నాగేశ్వర్‌రావు సినిమా థియేటరు ఆపరేటరుగా పనిచేస్తున్నాడు. వీరు ముగ్గురూ ముఠాగా ఏర్పడి ఏజెన్సీ ప్రాంతంలో దొరికే గంజాయిని కొనుగోలు చేసి ప్యాకెట్లలో పెట్టి కడప జిల్లా బద్వేలు టౌన చిదంబరనగర్‌కు చెందిన సుంకిరెడ్డి రంగారెడ్డి, పులివెందుల టౌన నగరిగుట్టలోని జడలమ్మ వీధికి చెందిన కావేటి నీలకంఠేశ్వర్‌తో కలిసి కారులో కడపకు తీసుకొచ్చేవారు. ఇక్కడి బైపా్‌సరోడ్డులో ఉండి కాలేజీ యువకులకు పేద, మధ్యతరగతి కూలీలకు విక్రయించేవారు. ఈ మేరకు సమాచారం అందుకున్న కడప డీఎస్పీ బి.సునీల్ ఆధ్వర్యంలో చిన్నచౌకు సీఐ అశోక్‌రెడ్డి, ఎస్‌ఐ అమర్‌నాఽథరెడ్డి తమ సిబ్బందితో నిఘా ఉంచి గురువారం నానాపల్లెలోని లేఅవుట్ వద్ద గంజాయిని విక్రయించేందుకు సిద్ధంగా ఉన్న నిందితులు అయిదుగురినీ అరెస్టు చేశారు. వీరి నుంచి 260 కిలోల గంజాయి, కారు, నాలుగు సెల్‌ఫోన్లు, రూ.3850 నగదు స్వాధీనం చేసుకున్నారు. పెద్ద ఎత్తున గంజాయిని స్వాధీనం చేసుకుని అయిదుగురు నిందితులను అరెస్టు చేయడంలో కీలకపాత్ర పోషించిన డీఎస్పీ సునీల్, సీఐ అశోక్‌రెడ్డి, ఎస్‌ఐ అమర్‌నాధరెడ్డి, ఏఎ్‌సఐ శంకర్‌నాయక్, హెడ్‌కానిస్టేబుళ్లు సుధాకర్, రామసుబ్బారెడ్డి, కానిస్టేబుళ్లు రాజే్‌షకుమార్, శ్రీనివాసులు, జనార్దనరెడ్డి, సుధాకర్‌యాదవ్, శివప్రసాద్, ఎం.శ్రీనివాసరావులను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.