నేడు వైవీయూలో క్యాంపస్ డ్రైవ్
ABN , First Publish Date - 2021-11-06T05:13:03+05:30 IST
వైవీ యూనివర్సిటీ ప్లేస్‌మెంట్ సెల్, ఏపీ స్కిల్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ సంయుక్త ఆధ్వర ్యంలో ఈనెల 6న యూనివర్సిటీలో క్యాంప్‌స డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు నేషనల్ సెల్ సంచాలకులు డాక్టర్ ఎల్‌వీ రెడి ్డ తెలిపారు.

కడప(వైవీయూ), నవంబరు 5: వైవీ యూనివర్సిటీ ప్లేస్‌మెంట్ సెల్, ఏపీ స్కిల్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ సంయుక్త ఆధ్వర ్యంలో ఈనెల 6న యూనివర్సిటీలో క్యాంప్‌స డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు నేషనల్ సెల్ సంచాలకులు డాక్టర్ ఎల్‌వీ రెడి ్డ తెలిపారు. హెరిటోసంస్థలో జూనియర్ కెమిస్ట్రీ, సీనియర్ ఆఫీసర్స్ పోస్టులకు బీఎస్సీ కెమెస్ట్రీ, ఎంఎ్‌సఈ ఆర్గానిక్స్, అనలిటికల్ కెమిస్ట్రీ చదివిన 2018 నుంచి 2021 సంవత్సరం విద్యాసంవత్సరంలో ఉత్తీర్ణులైనవారు అర్హులన్నారు. టెక్నీషియన్ పోస్టులకు ఐటీఐ ఫిట్టర్, పాలిటెక్నిక్ డిప్లమో, మెకానికల్ కోర్సుల్లో 2016-2021 సంవత్సరాల్లో ఉత్తీర్ణులు కావాలన్నారు. జూనియర్ ఇంజనీరింగ్ పోస్టుకు బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్ 2018-2021 సంవత్సరాల్లో ఉత్తీర్ణులు కావాలని సూచించారు. ఇంటర్వ్యూకు అర్హులైనవారు 28 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలన్నారు. ప్రతి కేటగిరిలో 50 ఖాళీగా ఉన్నాయని, ఎంపికైనవారు హైదరాబాద్, విశాఖపట్నం కేంద్రంగా విధులు నిర్వహించాల్సి ఉంటుందన్నారు. వైవీయూ క్యాంప్‌సలో ఉదయం 11 గంటలకు ముఖాముఖి ఇంటర్వ్యూలు ఉం టాయన్నారు. అర్హతాపత్రాలతో అభ్యర్థులు హాజరుకావాలని ఆయన సూచించారు.