ఉప్పరపల్లెలో ముమ్మరంగా తనిఖీలు
ABN , First Publish Date - 2021-02-02T05:20:58+05:30 IST
పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న నేపధ్యంలో కడప టూటౌన సీఐ మహ్మద్ ఆలీ ఆధ్వర్యంలో మండలంలోని ఉప్పరపల్లెలో సోమవారం రాత్రి విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.

చెన్నూరు, ఫిబ్రవరి 1 : పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న నేపధ్యంలో కడప టూటౌన సీఐ మహ్మద్ ఆలీ ఆధ్వర్యంలో మండలంలోని ఉప్పరపల్లెలో సోమవారం రాత్రి విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. అందులో భాగంగా ఆటోలు, ద్విచక్ర వాహనాలు, అందులో ప్రయాణించేవారు వాహనాలకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. అలాగే వాహనాలు నడిపే వారి వివరాలు తీసుకున్నారు. ఎవరు ఎలాంటి చర్యలకు పాల్పడినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ద్విచక్ర, త్రిచక్ర వాహనాల్లో మద్యం రవాణా, ఇతరత్రా ఏమైనా రవాణా చేస్తున్నారా అనేది పోలీసులు పరిశీలించారు. ఎన్నికలు అయిపోయేంత వరకు ప్రజలు ప్రశాంతంగా ఉండాలని ఎలాంటి ఘర్షణలకు అవకాశం లేకుండా చూసుకోవాలన్నారు. పోలీసులకు అందరూ సమానమేనని, ప్రశాంత ఎన్నికలకు పోలీసులకు సహకరించాలని సీఐ గ్రామస్థులకు తెలిపారు. కార్యక్రమంలో ఎస్‌ఐ జీవనరెడ్డి పాల్గొన్నారు.