ఎర్రగుంట్ల బ్రిడ్జిపై భారీ వాహనాలకు బ్రేక్‌

ABN , First Publish Date - 2021-11-24T05:27:29+05:30 IST

ఎర్రగుంట్ల-ప్రొద్దుటూరు ఎన్‌ హెచ్‌ రోడ్డు పెన్నానదిపైన నిర్మించిన బ్రిడ్జిపై భారీ వాహనాల రాకపోకలకు పోలీసులు అనుమతులు నిలిపివేశారు.

ఎర్రగుంట్ల బ్రిడ్జిపై భారీ వాహనాలకు బ్రేక్‌
ఎర్రగుంట్ల ఆర్‌వోబీ వద్ద అడ్డుగాపెట్టిన బోర్టులు

ఎర్రగుంట్ల, నవంబరు 23: ఎర్రగుంట్ల-ప్రొద్దుటూరు ఎన్‌ హెచ్‌ రోడ్డు పెన్నానదిపైన  నిర్మించిన బ్రిడ్జిపై భారీ వాహనాల రాకపోకలకు పోలీసులు అనుమతులు నిలిపివేశారు. ఎన్‌హెచ్‌ రహదారిలో కమలాపురం వద్ద పాపాఘ్నినదిపై నిర్మించిన హైలెవెల్‌ బ్రిడ్జి కుంగిపోయి పడిపోడం, అలాగే పెన్నానదిపై జమ్మలమడుగు-ముద్దనూరు మార్గ మధ్యలో నిర్మించిన హైలె వెల్‌ బ్రిడ్జి కుంగడంతో ఆ మార్గాల్లో రాకపోకలు ఆగిపోయాయి. దీంతో దేశం నలుమూల నుంచి వచ్చే వాహనాలన్ని ఈ మార్గం గుండానే వెళు తున్నాయి. పెన్నానదిలో ఇప్పటికి వ్రవాహ ఉధృతి ఉండటంతో ఈ బ్రిడ్జికి ఎలాంటి ప్రమాదం వస్తుందోనని ముందస్తుగా భారీ వాహనాల రాకపోక లు అధికారులు నిలపి వేశారు. ద్విచక్రవాహనాలు, కార్లు, ఇతర చిన్నచిన్న వాహ నాలు మాత్రమే పంపుతున్నారు. దీంతో భారీ వాహనాలు ఎటువెళ్లా లో దిక్కుతెలియని పరిస్థితి ఏర్పడింది. 

 కడపకు ఒకే మార్గం .... 

ఎర్రగుంట్ల నుంచి కడపకు వెళ్లాలంటే వయా  ప్రొద్దుటూరు, వేంపల్లి దారు లు మాత్రమే ఉన్నాయి. కానీ ప్రొద్దుటూరు రహదారి మూసుకుపోవడంతో భారీ వాహనాలకు తీవ్ర ఇబ్బంది కలుగుతోంది. దేశం నలుమూల నుంచి ఈ ఎన్‌హెచ్‌ ద్వారా రాకపోకలు జరుగుతున్నాయి. వేరే మార్గాల ద్వారా వె ళ్లాలంటే 40కిలోమీటర్లు అధిక దూరం అవుతోంది. దీని వల్ల భారీనష్టం వస్తుందని ఓనర్లు వాహనాల డ్రైవర్లు, క్లీనర్లు సైతం ఆందోళన వ్యక్తం చేస్తు న్నారు. కాగా ఎర్రగుంట్ల మండలం నుంచి రోజుకు కొన్ని వందల లారీలు నాపరాయి పరిశ్రమలు,  సిమెంటు ఫ్యాక్టరీలతోపాటు, ఆర్టీపీపీ నుంచి వచ్చే ఇతర రాష్ట్రాలకు రాకపోకలు సాగిస్తున్నాయి. దీంతో వంతెనకు ఎక్కడ ముప్పు వాటిల్లుతుందోనని ముందస్తు జాగ్రత్తగా అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా  వాహనదారులు బ్రిడ్జిపై రాకపోకలు నిలిపివేయడంతో ఆందోళనలో పడ్డారు. ఇప్పటికే పెట్రోలు, డీజల్‌ ధరలు పెరిగి ఇబ్బందులు పడుతుంటే ఉన్న మార్గం కాకుండా వేరే మార్గం ద్వారా సుమారు 40 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోందని వాపోతున్నారు. అధికారులు తమ పరిస్థితిని పరిశీలించాలని కోరుతున్నారు.

Updated Date - 2021-11-24T05:27:29+05:30 IST