ముక్తి రామలింగేశ్వరస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు రద్దు
ABN , First Publish Date - 2021-04-24T04:26:57+05:30 IST
కరోనా వైరస్ వేగంగా విస్త రిస్తుండడంతో స్థానిక ముక్తి రామలింగేశ్వరస్వామి ఆల యంలో నిర్వహించాల్సిన వార్షిక బ్రహ్మోత్సవాలను రద్దు చేస్తున్నట్లు ఆలయ ఈవో డీవీ రమణారెడ్డి తెలిపారు.
ప్రొద్దుటూరు టౌన్, ఏప్రిల్ 23: కరోనా వైరస్ వేగంగా విస్త రిస్తుండడంతో స్థానిక ముక్తి రామలింగేశ్వరస్వామి ఆల యంలో నిర్వహించాల్సిన వార్షిక బ్రహ్మోత్సవాలను రద్దు చేస్తున్నట్లు ఆలయ ఈవో డీవీ రమణారెడ్డి తెలిపారు. ఈనెల 25వ తేదీ నుంచి మే 4వ తేదీ వరకు బ్రహ్మోత్సవా లు నిర్వహించాల్సి ఉందని కరోనా వైరస్‌తో భక్తులు, సిబ్బంది ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని స్వామివారి పల్లకీ సేవలు, వాహనసేవలు, గ్రామోత్సవం, రథోత్సవాన్ని రద్దు చేశామన్నారు. స్వామివారికి ఏకాంతంగా పూజలను యఽథావిధిగా నిర్వహిస్తామని ఆయన తెలిపారు.