బ్రహ్మంగారిమఠం-విజయవాడ సర్వీసు ప్రారంభం

ABN , First Publish Date - 2022-01-01T05:25:46+05:30 IST

ప్రముఖ పుణ్యక్షేత్రమైన బ్రహ్మంగారిమఠం నుంచి విజయవాడకు నూతన బస్సు సర్వీసును ఏర్పాటు చేశారు.

బ్రహ్మంగారిమఠం-విజయవాడ   సర్వీసు ప్రారంభం
పూజలు నిర్వహిస్తున్న సర్పంచ్‌ రామయ్య

బ్రహ్మంగారిమఠం, డిసెంబరు 31: ప్రముఖ పుణ్యక్షేత్రమైన బ్రహ్మంగారిమఠం నుంచి విజయవాడకు నూతన బస్సు సర్వీసును ఏర్పాటు చేశారు. రోజూ ఈ సర్వీసు ఉంటుందని తెలిపారు. శుక్రవారం విజయవాడ నుంచి బ్రహ్మంగారిమఠంకు చేరుకున్న ఈ సర్వీసుకు స్థానిక సోమిరెడ్డిపలె ్ల సర్పంచ్‌ రామయ్య, విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు చెరువుపల్లె ప్రతాపాచారి, నొస్సం వీరభద్రస్వామి, ఎంపీటీసీ కొరుగుర్ని మనోహరాచారి, గిద్దలూరు శ్రీనివాసులు, గురుప్రసాద్‌, వేణు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Updated Date - 2022-01-01T05:25:46+05:30 IST