రికార్డుగదిలో బయటపడ్డ బ్రిటీష్ చట్టాల పుస్తకాలు
ABN , First Publish Date - 2021-10-29T05:15:57+05:30 IST
గత కొద్ది కాలంగా ప్రొద్దుటూరు తహసీల్దారు కార్యాలయంలోని రికార్డు గదిని సిబ్బంది శుభ్రం చేస్తున్నారు. ఈసందర్భంలో బ్రిటీ ష్ కాలం నాటి పురాతన రెవెన్యూ చట్టా ల పుస్తకాలు బయటపడ్డాయి.

పాతవిలువైన రికార్డులు
అప్పట్లోవాడిన లాంతర్లు దొరికిన వైనం
భద్రపరచనున్న రెవెన్యూ సిబ్బంది
ప్రొద్దుటూరు అర్బన్, అక్టోబరు 28: గత కొద్ది కాలంగా ప్రొద్దుటూరు తహసీల్దారు కార్యాలయంలోని రికార్డు గదిని సిబ్బంది శుభ్రం చేస్తున్నారు. ఈసందర్భంలో బ్రిటీ ష్ కాలం నాటి పురాతన రెవెన్యూ చట్టా ల పుస్తకాలు బయటపడ్డాయి. అంతేకాక గతంలో కలిసి వున్న మైదుకూరు, చాపా డు, ప్రొద్దుటూరు, దువ్వూరు, రాజు పాళెం మండలాల భూములకు సంబంధించి భూ రికార్డులు బయటపడ్డాయి. వందే ళ్ళకు పైబడిన చరిత్ర వున్న ఈ కార్యాల యం శిఽథిలావస్థకు చేరుకుని గదులన్నీ వర్షం వస్తే ఉరుస్తున్నాయి. దాతల సహకారంతో గత కొద్ది రోజులుగా మరమ్మతులు చేన్తున్నారు. అందులో భాగంగా రికార్డు గదిలో మూలన పెట్టెలో దాగివున్న పుస్తకాలను తీసి అందులో పనికి వచ్చే వాటిని భద్ర పరిచేందుకు డీటీ మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో రెవెన్యూ సిబ్బంది కృషి చేస్తున్నారు. బ్రిటీష్ కాలం నాటి ఈ చట్టాలకు సంబంధించిన పుస్తకాలు ఎంతో విలువైనవని, వాటిని భద్రపరిచి అవసరమైనపుడు రెఫరెన్స్‌గా వినియోగించు కుంటామని డీటీ తెలిపారు. అలాగే విద్యుత్ సౌకర్యం లేని రోజుల్లో ఉపయోగించే ఆనాటి లాంతర్లు ఈ శోధనలో బయటపడ్డాయి. రికార్డు గదికి ఇరువైపులా లాంతర్లు పెట్టేందుకు ప్రత్యే కంగా కడ్డీలను అమర్చారు. అందులో వాడే ప్రత్యేకమైన లిక్విడ్ కూడా దొరికింది. ప్రభుత్వం పురాతన చట్టాలు, వాటికి సంబంధించిన పుస్తకాలు భద్రపరిచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సి వుందని, ఈ భవనాల కట్టడాలను తొలగించకుండా కాపాడుకోవాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. నూతన తహసీల్దారు కార్యా లయ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.