మోదీ ఏడేళ్ల పాలనపై బీజేపీ సంబరాలు

ABN , First Publish Date - 2021-05-31T04:25:09+05:30 IST

ప్రధాని నరేంద్రమోదీ ఏడేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు జమ్మలమడుగులో బీజేపీ నాయకులు సంబరాలు చేసుకున్నారు.

మోదీ ఏడేళ్ల పాలనపై బీజేపీ  సంబరాలు
మానసిక వికలాంగులకు బిర్యాని వడ్డిస్తున్న దృశ్యం

జమ్మలమడుగు రూరల్‌, మే 30:ప్రధాని నరేంద్రమోదీ ఏడేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు జమ్మలమడుగులో బీజేపీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా పాత బస్టాండ్‌లోని గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం సేవహీసంఘటన్‌ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆదినారాయణరెడ్డి పిలుపుమేరకు పట్టణంలోని చిరువ్యాపారులకు, రిక్షా కార్మికులకు ప్లేట్లు, గ్లాసులు, పండ్లు అందజేశారు.  కార్యక్రమంలో బీజేపీ నాయకులు నార్పల బ్రహ్మనందరెడ్డి, దేవగుడి యూత్‌ బృందం ఆంజనేయులు, షరీఫ్‌, మహేంద్ర, పోలీసు చంద్ర, కౌన్సిలర్‌ బాణా శివరామలింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

ముద్దనూరులో  అన్నదానం


ముద్దనూరు మే30: కేం ద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చి 7 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భం గా, మోదీ రెండోసారీ ప్రధానిగా 2 సంవత్సరా లు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురుస్కరించుకొని బీజేపీ నాయకులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మండల బీజేపీ నాయకులు కటికరెడ్డి గుణవంత్‌రెడ్డి, మదుసూదనరెడ్డి ఆధ్వర్యంలో కోడిగాండ్లపల్లె సమీపంలోని మానసిక వికలాంగుల శరణాలయంలోని మానసిక వికలాంగులకు  చికెన్‌ బిర్యాని, పండ్లు వడ్డించారు.  కార్యక్రమంలో మండల బీజేపీ అధ్యక్షుడు కమలాకర్‌రెడ్డి, నాగేశ్వరరావు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మాస్క్‌లు, శానిటైజర్లు పంపిణీ


మైలవరం, మే 30 :  ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఏడు సంవత్సరాల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షడు ఆదినారాయణరెడ్డి ఆదేశాల మేరకు మండల పరిధిలోని దొమ్మరనంద్యాల, వేపరాల గ్రామాల్లోని ప్రజలకు బీజేపీ మండలాద్యక్షుడు శ్రీనివాసుల ఆధ్వర్యంలో ఆదివారం మాస్క్‌లు, శానిటైజర్లు పంపిణీ చేశారు.  కార్యక్రమంలో దొమ్మరనంద్యాల సర్పంచ్‌, బీజేపీ నాయకులు సురేంద్ర, కొండయ్య, భాష, దాసయ్య తదితరులు పాల్గొన్నారు. 

కొవిడ్‌ వారియర్స్‌కు పండ్లు పంపిణీ


ప్రొద్దుటూరు అర్బన్‌, మే 30 : బీజేపీ ఏడేళ్ల పా లనలో  దేశం సుభిక్షం గా ఉందని పార్టీ జిల్లా అధ్యక్ష, ఉపాధ్యక్షులు కర్నాటి ఎలారెడ్డి, గొర్రె శ్రీనివాసులు పేర్కొన్నా రు. ఆదివారం పట్టణ బీజేపీ అధ్యక్ష, కార్యదర్శులు సుబ్ర మణ్యం అంజిల ఆధ్వర్యం లో కొవిడ్‌ ప్రంట్‌ లైన్‌ వారియర్స్‌గా వున్న పోలీసులు ఆసుపత్రి ఉద్యోగులకు పండ్లు పంపిణీ చేయగా గ్రామల్లో మాస్కులు పంపిణీచేశారు. కొవిడ్‌ కేర్‌ సెంటర్లో వున్న రోగులకు పండ్లు అంద జేశారు. కార్యక్రమంలో బీజేపీ పట్టణ  కమిటీ సభ్యులు క్రిష్ణ , ప్రవీణ్‌ రాజా, సంజీవలు పాల్గొన్నారు

Updated Date - 2021-05-31T04:25:09+05:30 IST