101 మందిపై బైండోవర్
ABN , First Publish Date - 2021-02-02T04:49:19+05:30 IST
పంచాయతీ ఎన్నికల దృష్ట్యా మండలంలోని 9 గ్రామాలకు సంబంధించిన 101 రౌడీషీటర్లు, సమస్యాత్మక వ్యక్తులపై బైండోవర్ కేసులు నమోదు చేసినట్లు ఎస్‌ఐ మల్లికార్జునరెడ్డి తెలిపారు.

వీరపునాయునిపల్లె, ఫిబ్రవరి 1: పంచాయతీ ఎన్నికల దృష్ట్యా మండలంలోని 9 గ్రామాలకు సంబంధించిన 101 రౌడీషీటర్లు, సమస్యాత్మక వ్యక్తులపై బైండోవర్ కేసులు నమోదు చేసినట్లు ఎస్‌ఐ మల్లికార్జునరెడ్డి తెలిపారు. స్థానిక పోలీ్‌సస్టేషన్‌లో బైండోవర్ కేసులు నమోదైన వారికి కౌన్సెలింగ్ నిర్వహించారు. ఎస్‌ఐ మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికలు సజావుగా జరగా లని, ఎలాంటి అల్లర్లకు పాల్పడినా కేసులు నమోదు చేస్తామన్నారు. అనంతరం వారిని తహసీల్దార్ ఎదుట హాజరుపరిచి బైండోవర్ చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.