టీడీపీ అధినేతను కలిసిన భూపేశ్‌

ABN , First Publish Date - 2021-11-23T05:30:00+05:30 IST

టీడీపీ అధి నేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును జమ్మలమ డుగు పార్టీ ఇన్‌చార్జి భూ పేశ్‌రెడ్డి మంగళ వారం కడపలో కలిశారు.

టీడీపీ అధినేతను కలిసిన భూపేశ్‌
చంద్రబాబునాయుడుతో టీడీపీ నేత భూపేశ్‌రెడ్డి

జమ్మలమడుగు రూరల్‌, నవంబరు 23: టీడీపీ అధి నేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును జమ్మలమ డుగు పార్టీ ఇన్‌చార్జి భూ పేశ్‌రెడ్డి మంగళ వారం కడపలో కలిశారు. ఈ సందర్భం గా గండికోట జలాశయంలో 27 టీఎంసీలు నీరు నిలువ ఉంచడంతోనే నష్టం జరిగిందన్నారు. ప్రకృతి కన్నెర్ర చేయడంతో రైతులు కష్టపడి పెట్టుబడులు పెట్టి సాగు చేసిన పంటలు కొన్ని చోట్ల వరద ఉధృతికి, వర్షానికి పూర్తిగా నష్టం జరిగిందని  చంద్రబాబుకు వివరించినట్లు ఆయన తెలిపారు. భారీ వర్షాల వలన నష్టపోయిన రైతులను, కొండాపురం ముం పు గ్రామాల రైతులను ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి కోరారు. భూపేశ్‌రెడ్డితోపాటు  ఎమ్మెల్సీ శివనాథరెడ్డి సుమారు 20 వాహనాల్లో కార్యకర్తలతో తరలి వెళ్లినట్లు తెలిపారు.


Updated Date - 2021-11-23T05:30:00+05:30 IST