వైభవంగా భద్రావతి, భావన్నారాయణస్వామి వారి కల్యాణం
ABN , First Publish Date - 2021-11-29T05:20:15+05:30 IST
రామేశ ్వరంలోని భద్రావతి, భావన్నారాయణస్వామి ఆలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం స్వామివారి కల్యాణోత్సవాన్ని వైభ వంగా కన్నుల పండువగా నిర్వహించారు

ప్రొద్దుటూరు టౌన్, నవంబరు 28:రామేశ ్వరంలోని భద్రావతి, భావన్నారాయణస్వామి ఆలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం స్వామివారి కల్యాణోత్సవాన్ని వైభ వంగా కన్నుల పండువగా నిర్వహించారు. పద్మశాలీయ బహుత్తమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం మహాశివునికి, భద్రావతి, భావన్నారాయణస్వామి, శ్రీదేవి, భూదేవి సమేత వెంకటేశ్వరస్వామికి విశేష పూజలు, అభిషేకాలు, అర్చనలు నిర్వహించి ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం వేదికపై స్వామి అమ్మవార్లను ఆశీనులను చేసి కల్యాణం వైభవంగా నిర్వహించారు. కల్యాణం అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి రామేశ్వరం పద్మశాలీయ బహుత్తమ సంఘం అధ్యక్షుడు మేరువ పెంచలయ్య, వర్కింగ్‌ప్రెసిడెంట్ నందం కుమార్, కోశాధికారి సురే్‌షబాబు, నందం రామయ్య, మూర్తి, మేరువప్రసాద్, సుందరయ్య, సదానంద, ఆనంద్ పాల్గొన్నారు.