యశోదమ్మకు ఉత్తమ రైతు పురస్కారం

ABN , First Publish Date - 2021-11-01T04:52:19+05:30 IST

మండలంలోని చిన్నర్సుపల్లె గ్రామ పంచాయతీకి చెందిన మహిళా రైతు యశోదమ్మ ఉత్తమ రైతు పురస్కారం అందుకున్నారు.

యశోదమ్మకు ఉత్తమ రైతు పురస్కారం
ఉపరాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకుంటున్న యశోదమ్మయశోదమ్మకు ఉత్తమ రైతు పురస్కారం

చిన్నమండెం, అక్టోబరు 31: మండలంలోని చిన్నర్సుపల్లె గ్రామ పంచాయతీకి చెందిన మహిళా రైతు యశోదమ్మ ఉత్తమ రైతు పురస్కారం అందుకున్నారు. విజయవాడలో శనివారం రైతు నేత ఫౌండేషన్‌ అధ్వర్యంలో ఉపరాష్ట్ర పతి వెంకటయ్యనాయుడు చేతుల మీదుగా ఆమెకు పురష్కారం అం దజేశారు. ప్రకృతి వ్యవసాయ విభాగంలో సబ్‌డివిజనల్‌ యాంకర్‌గా పనిచేస్తుండడంతో ఈ అవార్డు వచ్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా యశోదమ్మ మాట్లాడుతూ తాను ఎన్నో రోజులుగా ప్రకృ తి వ్యవసాయం చేస్తున్నందుకు తనకు ఈ గౌరవం దక్కిందని ఆనందం వ్యక్తం చేశారు.  

Updated Date - 2021-11-01T04:52:19+05:30 IST