పీజీ అకడమిక్‌ ఇయర్‌ ప్రారంభం

ABN , First Publish Date - 2021-07-24T05:32:41+05:30 IST

పీజీ అకడమిక్‌ ఇయర్‌ అక్టోబరు 1 నుంచి ప్రారంభమవుతుందని రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రత్యేక కార్యదర్శి సతీ్‌షచంద్ర అన్నారు. శుక్రవారం రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల వీసీలతో సమావేశం నిర్వహించారు.

పీజీ అకడమిక్‌ ఇయర్‌ ప్రారంభం

రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రత్యేక కార్యదర్శి సతీ్‌షచంద్ర 

కడప(వైవీయూ), జూలై 23: పీజీ అకడమిక్‌ ఇయర్‌ అక్టోబరు 1 నుంచి ప్రారంభమవుతుందని రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రత్యేక కార్యదర్శి సతీ్‌షచంద్ర అన్నారు. శుక్రవారం రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల వీసీలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీలు స్వయం సంవృద్ధి దిశగా పరుగులు తీయాలని వీసీలకు సూచించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జాబ్‌ క్యాలెండర్‌ రానున్న దృష్ట్యా విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా అధ్యాపకుల ఖాళీలను చూపించాలని ఆయన  కోరారు. అధ్యాపకులు వారానికి ఆరు గంటలు తరగతులను చెప్పాల్సి ఉంటుందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌ హేమచంద్రారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలు ఒకే విద్యా క్యాలెండర్‌ను అమలు చేయాలని పీజీ ఉమ్మడి ప్రవేశ పరీక్షకు సంబంధించి వెంటనే పాలక మండలి అనుమతి తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో యూనివర్సిటీ వీసీ సూర్యకళావతి, ప్రిన్సిపాల్‌ కృష్ణారెడ్డి, అధ్యాపకులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-07-24T05:32:41+05:30 IST