రోడ్డు ప్రమాదంలో యాచకుడి మృతి

ABN , First Publish Date - 2021-08-26T04:57:00+05:30 IST

మండలంలోని శెట్టిగుంట ప్రధాన దారిలో బుధవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో తమిళనాడుకు చెందిన గుర్తు తెలియని యాచకుడు (80) మృతి చెందాడు.

రోడ్డు ప్రమాదంలో యాచకుడి మృతి

రైల్వేకోడూరు, ఆగస్టు 25: మండలంలోని శెట్టిగుంట ప్రధాన దారిలో బుధవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో తమిళనాడుకు చెందిన గుర్తు తెలియని యాచకుడు (80) మృతి చెందాడు. రైల్వేకోడూరు ఎస్‌ఐ-2 హేమాద్రి అందించిన వివరాల మేరకు...శెట్టిగుంట ప్రాంతంలో చిత్తు కాగితాలు ఏరుకుంటూ, యాచిస్తూ ప్రధాన దారిలో పక్కనే ఉన్న శ్రీక్రిష్ణ దేవాలయంలో తలదాచుకుంటుంటేవాడన్నారు. తెల్లవారుజామున రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొంది. దీంతో మృతి చెందినట్లు ఆయన వివరించారు. శవ పరీక్ష నిమిత్తం రాజంపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వివరించారు.

Updated Date - 2021-08-26T04:57:00+05:30 IST