ఒమైక్రాన్‌తో అప్రమత్తంగా ఉండాలి

ABN , First Publish Date - 2021-12-31T05:01:29+05:30 IST

ఒమైక్రాన్‌తో అప్రమత్తంగా ఉండాలి

ఒమైక్రాన్‌తో అప్రమత్తంగా ఉండాలి
ప్రొద్దుటూరులో ర్యాలీ నిర్వహిస్తున్న పోలీసు అధికారులు, సిబ్బంది తదితరులు

ప్రొద్దుటూరు క్రైం, డిసెంబరు 30 : రాష్ట్రంలోను ఒమైక్రాన్‌ కేసులు వెలుగులోకి వస్తున్న నేపఽథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్క్‌లు ధరించి అప్రమత్తంగా ఉండాలని ప్రొద్దుటూరు డీఎస్పీ వై.ప్రసాదరావు  సూచించారు.  గురువారం కొవిడ్‌ జాగ్రత్తలతోపాటు ట్రాఫిక్‌ నిబంధనలపై ప్రజల్లో అవగాహన కల్పించే దిశగా ఇక్కడి పోలీసు అధికారులు, మహిళా పోలీసులు, వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శులు, గ్రామవార్డు మహిళా సంరక్షణ కార్యదర్శులతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ స్థానిక త్రీటౌన్‌ పోలీ్‌సస్టేషన్‌ నుంచి శివాలయం వీధి గుండా పుట్టపర్తి సర్కిల్‌ వరకు సాగింది. అనంతరం డీఎస్పీ మాట్లాడుతూ ఒమైక్రాన్‌ ఽథర్డ్‌వేవ్‌ నుంచి రక్షణ మాస్క్‌ఽతోనే సాధ్యమని అదే విధంగా భౌతిక దూరం పాటించి చేతులను శానిటైజర్‌తో తరచూ శుభ్రం చేసుకోవాల్సి ఉందన్నారు. ఏవైనా లక్షణాలుంటే, వెంటనే వైద్యులను సంప్రదించాలన్నారు. మోటారుసైకిళ్లు నడిపేవారు హెల్మెట్‌ ధరించాలని, కార్లు నడిపేవారు సీట్‌ బెల్ట్‌ పెట్టుకోవడంతో పాటు ట్రాఫిక్‌ నియమ నిబంధలను పాటిస్తూ వాహనాలను నడపాలన్నారు. ట్రాఫిక్‌ నిబంధనలు పాటించకపోయినా, మాస్క్‌లు ధరించకపోయినా జరిమానా తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో వన్‌టౌన్‌ సీఐ నాగరాజు, త్రీటౌన్‌ సీఐ ఆనందరావు, ట్రాపిక్‌ సీఐ శుభకుమార్‌, రూరల్‌ సీఐ మధుసూదన్‌గౌడ్‌, ఎస్‌ఐలు, పోలీసులు, మహిళా సంరక్షణ కార్యదర్శులు పాల్గొన్నారు. 

వాహనదారులు ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలి

జమ్మలమడుగు రూరల్‌, డిసెంబరు 30: వాహనదారులు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్‌  నిబంధనలు పాటించాలని జమ్మలమడుగు అర్బన్‌ సీఐ వెంకటేశ్వర్లు, ఎస్‌ఐలు సూచించారు. గురువారం  పట్టణంలో  పోలీసు అధికారులు ట్రాఫిక్‌ అవగాహనపై ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధాన రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ ద్విచక్ర వాహనాలు, నాలుగు చక్రాల వాహనాలు నిలుపరాదన్నారు.  ఇంటి నుంచి బయటకు వస్తున్న సమయంలో తప్పనిసరిగా మాస్కు ధరించాలన్నారు.  కార్యక్రమంలో ఎస్‌ఐ రఘురాం, విద్యార్థులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

 మాస్క్‌,  హెల్మెట్‌ తప్పనిసరి

ఎర్రగుంట్ల, డిసెంబరు 30: ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ మాస్క్‌, హెల్మెట్‌ ధరించి వాహనాలు నడపాలని అర్బన్‌ సీఐ సదాశివయ్య సూచించారు. గురువారం ఆయన జిల్లా ఎస్పీ, డీఎస్పీ ఆధేశాల మేరకు ఎర్రగుంట్ల ఆర్టీసీ బస్టాండ్‌ ఆవరణలో  పోలీసు సిబ్బందితో ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కొవిడ్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ  జాగ్రత్తలు పాటించాలిలన్నారు.  కారు నడిపే ప్రతి ఒక్కరూ సీట్‌బెల్టు పెట్టుకోవాలని, ద్విచక్ర వాహన చోదకులు హెల్మెట్‌ ధరించాలన్నారు. ఈకార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. Updated Date - 2021-12-31T05:01:29+05:30 IST