కన్నుల పండువగా అయ్యప్పస్వామి గ్రామోత్సవం

ABN , First Publish Date - 2021-11-27T04:36:36+05:30 IST

పట్టణంలో అయ్యప్ప శరణు ఘోష మార్మోగింది. కన్నెస్వాముల కలశాలతో అయ్యప్ప మాలదారులు వెంటరాగా గురుస్వామి ప్రతా్‌పకుమార్‌ ఆధ్వర్యంలో అయ్యప్పస్వామి గ్రామోత్సవం నిర్వహించారు.

కన్నుల పండువగా అయ్యప్పస్వామి గ్రామోత్సవం
రథంలో ఊరేగుతున్న అయ్యప్పస్వామి

బద్వేలు రూరల్‌, నవంబరు 26: పట్టణంలో అయ్యప్ప శరణు ఘోష మార్మోగింది. కన్నెస్వాముల కలశాలతో అయ్యప్ప మాలదారులు వెంటరాగా గురుస్వామి ప్రతా్‌పకుమార్‌ ఆధ్వర్యంలో అయ్యప్పస్వామి గ్రామోత్సవం నిర్వహించారు. కేరళ ప్రత్యేక వా యిద్యాలు, విచిత్ర వేషధారణలు, మిరిమిట్లు గొలిపే బాణా సంచా పేలుళ్లతో ప్రధాన రహదారుల్లో గ్రామోత్సవం సాగింది.  అనుడా చైర్మన్‌  సింగసాని గురుమో్‌హన్‌,  మార్కెట్‌యార్డ్‌ వైస్‌చైర్మన్‌ కరెంటు రమణారెడ్డి, రాష్ట్ర సివిల్‌ సప్లై డైరెక్టర్‌ సుందరరామిరెడ్డిలు గ్రామోత్సవంలో స్వామివారిని దర్శించుకున్నారు. 

Updated Date - 2021-11-27T04:36:36+05:30 IST