అక్రమ లేఔట్లపై అవగాహన అవసరం

ABN , First Publish Date - 2021-12-20T04:30:09+05:30 IST

అక్రమ లేఔట్లపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంపొందించుకోవాలి. కలసపాడు చు ట్టుపక్కల ప్రాంతాల్లో అక్రమ లే ఔట్లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి.

అక్రమ లేఔట్లపై అవగాహన అవసరం
మహానంది పంచాయతీలో అక్రమంగా వెలసిన లేఔట్‌

కలసపాడు, డిసెంబరు 19: అక్రమ లేఔట్లపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంపొందించుకోవాలి. కలసపాడు చు ట్టుపక్కల ప్రాంతాల్లో అక్రమ లే ఔట్లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. ఇటీవ ల భూముల ధరలు పెరగడంతో కొం దరు లేఔట్లను వేస్తున్నారు. అయితే వ్యవసాయ భూమిని వాణిజ్య అవసరా లకు మారుస్తున్నట్లు అనుమతులు పొంది అమ్మాల్సి ఉంటుంది. ఇందు కోసం ప్రభుత్వం రూపొందించిన విధి విధానాలను అనుసరించి గ్రామీణ ప్రాంతాల్లో చదరపు మీటర్‌కు రూ.100 వరకు చెల్లించాలి.

లేఔట్‌ వేసిన విస్తీర్ణంలో 10 శాతం గ్రామ పంచాయతీకి లేఔట్‌ నిర్వాహకులే రిజిస్ర్టేషన్‌ చేసి అందించాలి. అనంతరం సర్వీసు రోడ్లు, విద్యుత్‌, నీటి వసతుల కోసం అనుమతులు పొందాలి. పక్కాగా డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ఇవన్నీ చేయకుండానే అక్రమంగా లేఔట్లు వేస్తూ రెండు, మూడు సెంట్లు, వ్యవసాయ భూమిగానే రిజిస్ర్టేషన్‌ చేస్తుండడంతో ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతోంది. లేఔట్‌ అనుమతులు, లేఔట్‌ చుట్టుకొలతకు సంబంధించిన మ్యాప్‌ను బహిరంగంగా ప్రదర్శించాలి. ఇవన్నీ లేకుండానే వ్యవసాయ భూమిని ఇళ్ల స్థలాలుగా చూపి స్తూ రిజిస్ర్టేషన్‌ చేస్తున్నారు.

పట్టించుకోవాల్సిన సంబంధిత పంచాయతీ, ఇతర సిబ్బంది పట్టించుకోవడం లేదు. రోడ్డు పక్కనే రోడ్లు వేసి ప్లాట్లగా విభజించి అమ్ముతున్నా సరైన చర్యలు చేపట్టి ఉంటే పంచాయతీకి పెద్ద ఎత్తున నిధులు వచ్చి మరింత అభివృ ద్ధి చేసుకునే అవకాశం ఉండేది. ఇప్పటికైనా సంబంధిత శాఖల అధికారులు అక్రమ లేఔట్లపై దృష్టికి నిలిపితే పంచాయతీలకు నిధులు పుష్కలంగా వచ్చే అవకాశం ఉంది. ఈ విషయమై మహానందిపల్లి పంచాయతీ సెక్రటరి సృజనను వివరణకోరగా అక్రమ లేఔట్లు తమ దృష్టికి రాలేదని తెలిపారు. 

Updated Date - 2021-12-20T04:30:09+05:30 IST