ఆటో-కారు ఢీ : వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2021-12-10T04:27:31+05:30 IST

భాకరాపేట సమీపంలోని కనుమలపల్లె వద్ద గురువారం రాత్రి ఆటోను కారు ఢీకొనడంతో వ్యక్తి మృతి చెందాడు.

ఆటో-కారు ఢీ : వ్యక్తి మృతి
ప్రమాదంలో మృతి చెందిన శివలింగమూర్తి

సిద్దవటం, డిసెంబరు 9 : భాకరాపేట సమీపంలోని కనుమలపల్లె వద్ద గురువారం రాత్రి ఆటోను కారు ఢీకొనడంతో వ్యక్తి మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. చెన్నూ రు మండలం పాలెంపల్లె గ్రామానికి చెందిన శివలింగమూర్తి (60) ఆటోలో వంటపాత్రలు వేసుకుని వచ్చి అమ్ము తుండేవాడు. వ్యాపారం అనంతరం భాకరాపేట నుంచి అతడి భార్యతో కలిసి గురువారం రాత్రి కడపకు వెళుతుండగా కనుమలోపల్లె సమీపంలో కడప నుంచి రాజంపేటకు వెళుతున్న కారు వేగంగా వచ్చి ఆటోను ఢీకొంది. దీంతో ఆటో డ్రైవర్‌ శివలింగమూర్తి అక్కడికక్కడే మృతి చెందాడు. అతడి భార్య తీవ్రంగా గాయపడింది. సమాచారం తెలుసుకున్న సిద్దవటం హెడ్‌ కానిస్టేబుల్‌ చంద్రశేఖర్‌, కానిస్టేబుల్‌ శివరాఘవ ప్రదీ్‌పలు ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన మహిళను చికిత్స నిమిత్తం 108 ద్వారా కడప రిమ్స్‌కు తరలించారు. ఈ విషయంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వారు తెలియజేశారు. 

Updated Date - 2021-12-10T04:27:31+05:30 IST