అక్రమ మైనింగ్‌పై అధికారుల దాడి

ABN , First Publish Date - 2021-07-13T05:20:36+05:30 IST

పట్టణ శివారులోని గగ్గితిప్పపై అక్రమ మైనింగ్‌ జరుపుతున్నట్లు సమాచారం అందుకున్న భూగర్భశాఖ విజిలెన్స్‌ అధికారులు దాడి చేసి రెండు ఎక్స్‌కవే టర్లు, ఒక ట్రాక్టర్‌ను స్వాధీనం చేసు కున్నారు.

అక్రమ మైనింగ్‌పై అధికారుల దాడి

రెండు ఎక్స్‌కవేటర్లు, ఒక ట్రాక్టర్‌ స్వాధీనం


మైదుకూరు, జూలై 12: పట్టణ శివారులోని గగ్గితిప్పపై అక్రమ మైనింగ్‌ జరుపుతున్నట్లు సమాచారం అందుకున్న భూగర్భశాఖ విజిలెన్స్‌ అధికారులు దాడి చేసి రెండు ఎక్స్‌కవే టర్లు, ఒక ట్రాక్టర్‌ను స్వాధీనం చేసు కున్నారు. విజిలెన్స్‌ రీజనల్‌ అసిస్టెంట్‌ రవీంద్ర ప్రసాద్‌ వివరాల మేరకు... గగ్గితిప్పపై అక్రమ మైనింగ్‌ చేస్తున్నట్లు సమాచారం రావడంతో తమ బృందంచే తనిఖీలు నిర్వహించామన్నార.  ఎటువంటి అనుమతిలేకుండా అక్రమంగా మైనింగ్‌ జరుపుతూ రవాణాకు పాల్పడుతున్న రెండు ఎక్స్‌కవేటర్లు, ఒక ట్రాక్టర్‌ను సీజ్‌ చేసి పోలీసులకు అప్పగించినట్లు ఆయన తెలిపారు.

Updated Date - 2021-07-13T05:20:36+05:30 IST