ఏటీఎంలో చోరీకి విఫల యత్నం

ABN , First Publish Date - 2021-11-03T05:23:30+05:30 IST

మండల కేంద్రంలోని కెనరా బ్యాంకు ఏటీఎంలో నగదు చోరీకి గుర్తు తెలియని వ్యక్తు లు విఫల ప్రయత్నం చేశారు.

ఏటీఎంలో చోరీకి విఫల యత్నం

 క్లూస్‌ టీం, డాగ్‌ స్క్వాడ్‌ తనిఖీలు

సుండుపల్లె, నవంబరు2: మండల కేంద్రంలోని కెనరా బ్యాంకు ఏటీఎంలో నగదు చోరీకి గుర్తు తెలియని వ్యక్తు లు విఫల ప్రయత్నం చేశారు. సోమవారం రాత్రి ఏటీఎంలోకి చొరబడి నగదు కో సం తీవ్ర ప్రయత్నాలు చేశారు. మంగళవారం ఉదయం బ్యాంకు అధికారులు గుర్తించి సుండుపల్లె ఎస్‌ఐ నరసింహులుకు తెలియజేయడంతో ఎస్‌ఐ సిబ్బందితో పరిశీలించి సీసీ కెమెరాలను పరిశీలించారు. అలాగే ఉ న్నతాధికారులకు సమాచారం ఇచ్చి డాగ్‌స్క్వాడ్‌, క్లూస్‌ టీం అధికారులను రప్పించి తనిఖీలు ముమ్మరం చేశారు. అక్కడే ప్రతిరోజు ఉంటున్న జేసీబీ సిబ్బందిని విచారించారు. ఆ బ్యాంకులో అసిస్టెంట్‌ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్న రాఘవేంద్ర ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.  

Updated Date - 2021-11-03T05:23:30+05:30 IST