బ్యాంకులో చోరీకి యత్నం

ABN , First Publish Date - 2021-01-14T04:55:15+05:30 IST

స్థానిక గాంధీరోడ్డులో ఉన్న ఇండియన్‌ ఓవర్‌సిస్‌ బ్యాంకులో చోరీకి గుర్తు తెలియని వ్యక్తులు యత్నించారు.

బ్యాంకులో చోరీకి యత్నం

ప్రొద్దుటూరు క్రైం, జనవరి 13 : స్థానిక గాంధీరోడ్డులో ఉన్న ఇండియన్‌ ఓవర్‌సిస్‌ బ్యాంకులో చోరీకి గుర్తు తెలియని వ్యక్తులు యత్నించారు. బ్యాంక్‌ గేటు తాళం పగులగొట్టడంతో పాటు, కిటికి ఊచలను తొలగించే ప్రయత్నంలో అక్కడ గోడను ధ్వంసం చేశారు. ఈ ఘటన బుధవారం ఉదయం వెలుగు చూసింది. బ్యాం కు అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వన్‌టౌన్‌ సీఐ నాగరాజు, ఎస్‌ఐ శివశంకర్‌లు సిబ్బందితో బ్యాంకు వద్దకు వెళ్లి, అక్కడి పరిసరాలను పరిశీలించారు. బ్యాంకు అధికారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నాగరాజు తెలిపారు. 

 

Updated Date - 2021-01-14T04:55:15+05:30 IST