స్థావరాలపై దాడులు - నాటుసారా సీజ్‌

ABN , First Publish Date - 2021-08-26T04:37:18+05:30 IST

వేర్వేరు ప్రాంతాల్లో నాటుసారా తయారీ స్థావరాలపై దాడులు చేసి నాటుసారాను సీజ్‌ చేసినట్లు పోలీసు, ఎస్‌ఈబీ అధికారులు తెలి పారు.

స్థావరాలపై దాడులు - నాటుసారా సీజ్‌

వేంపల్లె, ఆగస్టు 25: వేర్వేరు ప్రాంతాల్లో నాటుసారా తయారీ స్థావరాలపై దాడులు చేసి నాటుసారాను సీజ్‌ చేసినట్లు పోలీసు, ఎస్‌ఈబీ అధికారులు తెలి పారు. వేంపల్లె మండలం రామిరెడ్డిపల్లె వాసి లింగాల కృష్ణారెడ్డి నుంచి ఐదు లీ టర్ల నాటుసారాను సీజ్‌ చేసినట్లు ఎస్‌ఈబీ సీఐ రామాంజనేయులు తెలిపారు. అతన్ని కోర్టు ఎదుట హాజరుపరుచగా అతనికి 14రోజులు రిమాండ్‌కు ఆదేశించి నట్లు సీఐ తెలిపారు. మద్యం కేసుల్లో నేరస్థులైన పులివెందుల మండలం నల్లపు రెడ్డిపల్లె వాసి సిద్దయ్య, వెంకటాపురం గ్రామస్తుడు కత్తి రామకృష్ణను సత్ప్రవర్తన కోసం పులివెందుల తహసీల్దార్‌ ఎదుట బైండోవర్‌ చేసినట్లు తెలిపారు. 

అంబకపల్లె గ్రామంలో....

లింగాల, ఆగస్టు 18: అంబకపల్లెలో నాటుసారా స్థావరాలపై దాడులు చేసి ఇద్దరి ని అరెస్టు చేసినట్లు ఎస్‌ఐ హృషికేశ్వర్‌రెడ్డి తెలిపారు. అందిన సమాచారం మేర కు అంబకపల్లె కొండప్రాంతాల్లో నాటుసారా స్థావరం ఉన్నట్లు సమాచారం రావ డంతో సిబ్బందితో వెళ్లి దాడులు చేశామన్నారు. ఇందులో 25లీటర్లు నాటుసారా, 150 లీటర్ల ఊట స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్టు చేసినట్లు తెలిపారు.

Updated Date - 2021-08-26T04:37:18+05:30 IST