యువకుడిపై కత్తులతో దాడి

ABN , First Publish Date - 2021-08-11T05:04:30+05:30 IST

కడప నగరం కందిపాలెంకు చెందిన దేవతల ప్రశాంత్‌పై మేరీ నగర్‌, ఇందిరానగర్‌కు చెందిన 15 మంది కత్తులతో దాడి చేసినట్లు వన్‌టౌన్‌ సీఐ సత్యనారాయణ మంగళవారం తెలిపారు. ఆయన వివరాల మేరకు..

యువకుడిపై కత్తులతో దాడి

15 మందిపై కేసు నమోదు 

కడప(కైం), ఆగస్టు 10: కడప నగరం కందిపాలెంకు చెందిన దేవతల ప్రశాంత్‌పై మేరీ నగర్‌, ఇందిరానగర్‌కు చెందిన 15 మంది కత్తులతో దాడి చేసినట్లు వన్‌టౌన్‌ సీఐ సత్యనారాయణ మంగళవారం తెలిపారు. ఆయన వివరాల మేరకు.. ప్రశాంత్‌ అన్న సుశాంత్‌ జడ్పీ ఆఫీ సులో పనిచేస్తున్నారు. ఈ నెల 7వ తేదీన ఇందిరా నగర్‌కు చెందిన చాన్‌, సుశాంత్‌కు ఫోన్‌ చేసి తెలుగు గంగ కాలనీకి పిలిపించి అక్కడ దాడి చేసేందుకు యత్నించాడు. అంతలోనే అక్కడికి సోదరుడు ప్రశాంత్‌ వెళ్లడంతో ఇద్దరిపై దాడి చేశారు. అనంతరం ఈ నెల 8న ఎర్రముక్కపల్లె వద్ద ప్రశాంత్‌ ఉండగా, కాపు కాచి చిన్న, సంజయ్‌, సుజన్‌, దిలీప్‌, నాని, సర్దార్‌ మరికొందరితో కలిసి కత్తులతో దాడి చేసి గాయపరిచినట్లు తెలిపారు. చికిత్స నిమిత్తం ప్రశాంత్‌ను రిమ్స్‌కు తరలించి కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు సీఐ తెలిపారు. 

Updated Date - 2021-08-11T05:04:30+05:30 IST