ఇంటిపై దాడి... సామగ్రి ధ్వంసం

ABN , First Publish Date - 2021-11-03T05:22:23+05:30 IST

పట్టణంలోని గాండ్ల వీధిలో సోమవారం రాత్రి ఇంటిపై దాడి చేసి సామగ్రి ధ్వంసం చేసిన ఘటనపై పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు.

ఇంటిపై దాడి... సామగ్రి ధ్వంసం

ఇరువర్గాలకు చెందిన 18 మందిపై కేసు నమోదు

వేంపల్లె, నవంబరు 2: పట్టణంలోని గాండ్ల వీధిలో సోమవారం రాత్రి ఇంటిపై దాడి చేసి సామగ్రి ధ్వంసం చేసిన ఘటనపై పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. ఇరువర్గాలపై కేసు నమోదు చేసినట్లు పులివెందుల రూ రల్‌ సీఐ రవీంద్రనాథ రెడ్డి తెలిపారు. దాడిఘటనకు సంబంఽధించి ఎస్‌ఐలు తిరు పాల్‌ నాయక్‌, సుభాష్‌ చం ద్ర బోస్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. 4వ వా ర్డులో టీడీపీకి చెందిన ఏమిరెడ్డి కృష్ణారెడ్డి సింగారెడ్డి భానుకు సిమెంటు, కడ్డీల డబ్బు బాకీ ఉన్నాడు. బాకీ మొత్తం చెల్లించాలని భాను అడిగినప్పటికీ ఇవ్వక పోవడంతో సోమవారం రాత్రి భానుతో పాటు మరికొందరు ఏమిరెడ్డి కృష్ణారెడ్డి ఇంటి వద్దకెళ్లి కారు అద్దాలు, ఇంటి కిటికీలు, వాకిళ్లు, సామగ్రి ధ్వంసం చేశారు. ఈ ఘటనపై ఏమిరెడ్డి కృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు 11 మందిపై కేసు నమోదు చేసి నట్లు ఎస్‌ఐ తిరుపాల్‌నాయక్‌ తెలిపారు. డబ్బు బాకీ విషయంపై అడిగేం దుకు కృష్ణారెడ్డి ఇంటివద్దకెళ్లగా రాళ్లతో దాడి చేశారని, ఒ కరి తలకు గాయా లయ్యాయని భాను ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏమిరెడ్డి కృష్ణారెడ్డితో పాటు ఏడుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సుభాష్‌చంద్రబోస్‌ తెలిపారు. దీనిపై పూర్తి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐలు తెలిపారు. కాగా ఇరువర్గాలతో ఎమ్మెల్సీ బీటెక్‌ రవి చర్చించినట్లు తెలిసింది. 

Updated Date - 2021-11-03T05:22:23+05:30 IST