అతలాకుతలం

ABN , First Publish Date - 2021-11-21T05:43:40+05:30 IST

వారం రోజులుగా ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. పాపాఘ్ని ఉధృతికి వేల ఎకరాల్లో పంటలు నేలకొరిగాయి.

అతలాకుతలం
రంగనాయకుల తువ్వ గ్రామ చీనీ తోటలో చేరిన వర్షం నీరు

30 గ్రామాలకు అన్నీ కట్‌

15 వేల ఎకరాల్లో చీనీ తోటలు నష్టం 

కోలుకోలేని స్థితిలో రైతన్న

చక్రాయపేట/సింహాద్రిపురం/పోరుమామిళ్ల/

ఖాజీపేట/ అట్లూరు/ గోపవరం/బి.కోడూరు/ లింగాల/చాపాడు/ పులివెందులరూరల్‌ నవంబ రు 20: వారం రోజులుగా ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. పాపాఘ్ని ఉధృతికి వేల ఎకరాల్లో పంటలు నేలకొరిగాయి. అద్దాలమర్రి హైలెవెల్‌ కాజ్‌వే కొట్టుకుపోవడంతో తీర ప్రాంతాలైన అద్దాలమర్రి, కుమార్లకా ల్వ, ఎరబొమ్మనపల్లె, రాచుపల్లె, కె ఎర్రగుడి, కల్లూరుపల్లె పంచాయతీల్లోని 30గ్రామాలకు నీరు, రవాణా, విద్యుత్‌ సరఫరా నిలిచిపోయాయి.

కుప్పం కాజ్‌ వే, కొండప్పగారిపల్లె, నాగుల గుట్టపల్లె, తక్కల్లపల్లె తదితర గ్రామాల్లోని బ్రిడ్జి లు కొట్టుకుపోయాయి. అద్దాలమర్రి, కుప్పం బ్రిడ్జిలను ఓఎస్డీ అనిల్‌కుమా ర్‌రెడ్డి, డీఎస్పీ శ్రీనివాసులు, నేషనల్‌ హైవేని ఈఈ ఓబుళరెడ్డి, ఏఈ రఘునా థ్‌ పరిశీలించారు. నది ఒడ్డున ఉన్న కాశిరెడ్డినాయన ఆశ్రమం కొట్టుకుపోయిం ది. నీరు వస్తున్న విషయాన్ని గుర్తించిన నిర్వాహకులు గుట్టపైకెక్కి ప్రాణాల ను దక్కించుకున్నారు. నీటి ఉధృతిలో 10 అండాలు, 30మూటెల బియ్యం, 10వడ్ల మూటలు, బ స్తా కందిబేడలు, మూడు ఆవులు కొట్టుకుపోయాయి. 

సింహాద్రిపురం మండలంలో సాగులో వున్న 15 వేల 468 ఎకరాల్లో చీనీ రైతులకు అపార నష్టం వాటిల్లింది. ఇటీవల వరుస తుఫానులతో చీనీ ధరలు పూర్తిగా తగ్గుముఖం పట్టాయి.

ప్రస్తుతం వర్షాలతో మార్కెట్‌ బంద్‌ కావడంతో రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది. భూమిలో తేమ శాతం పెరగడంతో చీనీ కాయలు రాలిపోతున్నాయి. తోటల్లో వరద నీరు చేరి మరింత నష్టం చేకూర్చిందని రైతులు వాపోతున్నారు. రైతులను ఆదుకోవాలని కోరారు.

పోరుమామిళ్ల మూలవీధి, పూలబజార్‌, బెస్తవీధి, శీనప్పబావి వీధుల్లో వర్షం నీరు చేరడంతో నీటి కుంటను తలపిస్తోంది. పోరుమామిళ్ల పంచాయతీ లో డ్రైనేజీ పూడిపోవడంతో వర్షపు నీరు రోడ్లపై చేరడంతో వీధుల్లో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంచాయతీ అధికారులు స్పందించి పూడిపోయిన డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలన్నారు.

కొందరు మహిళలు నిలిచి ఉన్న నీటిలో నిలబడి నిరసన తెలిపారు. విషయం తెలుసుకున్న మండ ల ఉపాధ్యక్షుడు సీఎం బాష, పోరుమామిళ్ల కార్యదర్శి రామ్మోహన్‌రెడ్డి వీధుల్లో పరిశీలించి ఆదివారం పూడిక తీయిస్తామని తెలిపారు. 

ఖాజీపేట మండలంలో రంగనాయకుల తువ్వ, కొమ్మలూరు, త్రిపురవరం గ్రామాలను పెన్నానది చుట్టుముట్టింది. తుఫాను ప్రభావం రైతులకు పీకల్లో తు కష్టాలను మిగిల్చింది. పంట పొలాలను పూర్తిగా ముంచెత్తాయి. కొమ్మలూరు, త్రిపురవరం గ్రామాల్లో ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 

ఆదినిమ్మాయపలె ్ల ఆనకట్ట వద్దకు చేపల వేటకు వెళ్లిన 12 మంది మత్స్యకారులను సీఐ కొండారెడ్డి, ఎస్‌ఐ కుళాయప్ప తన సిబ్బందితో కలిసి సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. 

అట్లూరు, నవంబరు 20: నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు సోమశిల వెనుక జలాల ముంపు గ్రామాలు ముత్తుకూరు, శాంతినగర్‌ ప్రజల ను బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్‌ దాసరి సుధ పరామర్శించారు. ముంపు వాసులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. మండల వైసీపీ నేతలు పాల్గొన్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో మట్టితో నిర్మించిన గృహాల్లో ఉన్న వారు అప్రమత్తం గా ఉండాలని గోపవరం తహసీల్దార్‌ రమణారెడ్డి, సర్పంచి కలువాయి లక్ష్మీదే వి, ఎంపీడీఓ మోహన్‌ పేర్కొన్నారు. వర్షాల కారణంగా దెబ్బతిన్న గృహాలను సందర్శించి వారికి నిత్యావసర వస్తులు పంపిణీ చేశారు. గ్రామీణులు అఽధికారుల సూచనల మేరకు సురక్షిత ప్రాంతాలకు తరలాలన్నారు. వీఆర్వోలు మో సె, చెన్నయ్య, సతీష్‌ పాల్గొన్నారు.

వర్షాలకు పూర్తిగా దెబ్బతిన్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కాల్వపల్లె సర్పంచ్‌ పసుపులేటి శ్రీనివాసులు పేర్కొన్నారు. శనివారం దెబ్బతిన్న పంట పొలాలను సచివాలయ వ్యవసాయాధికారులతో కలిసి పరిశీలించారు. ఒక్క కాలువ పల్లె పంచాయతీలోనే సుమారు 300 ఎకరాలకు పైగా పంటలు దెబ్బతిన్నాయని దీంతో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. వ్యవసాయాధికారి సుబ్బరాయు డు, పసుపులేటి రమణయ్య, వీరారెడ్డి, సుబ్బారెడ్డి, ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. 

బి.కోడూరు మండలంలో కురుస్తున్న భారీ వర్షాలతో దెబ్బతిన్న వరి పంటను వ్యవసాయాధికారి సురేష్‌కుమార్‌రెడ్డి సిబ్బందితో కలిసి పరిశీలించారు. 33 శాతం కంటే ఎక్కువ దెబ్బతిన్న పంటను నష్టం కింద నమోదు చేసి ఉన్నతాధికారులకు నివేదిక పంపిస్తామన్నారు. 

లింగాల మండలంలో శుక్రవారం రాత్రి కురి సిన వర్షానికి రామన్నూతలపల్లెలో శివశంకర్‌రెడ్డి కి చెందిన 6వేల అరటిచెట్లు నేలకొరిగాయి. రైతు శివశంకర్‌రెడ్డి పదెకరాల్లో అరటి పంటతో రూ.6 లక్షలు నష్టం జరిగినట్లు రైతు తెలిపారు. 

మైలవరం జలాశయం నుంచి భారీగా నీటిని పెన్నానదిలోకి విడుదల చేయడంతో చాపా డు వద్ద వరద ఉధృతి ఎక్కువైంది. రెండు రోజుల నుంచి పెన్నానదిలో వరదపోటెత్తింది. పెన్నానది తీరం వెంబడి ఉన్న తిప్పిరెడ్డిపల్లె, రాజుపాళెం, వెదురూరు గ్రామాల పరిధిలోని సాగు చేసిన వేరుశనగ పైరు సుమారు రెండు వేల ఎకరాల్లో దెబ్బతినింది. 70 ఎకరాల్లో పసుపు, 30 ఎకరాల్లో జామతోట నీట మునిగింది. చాలా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. 

పులివెందుల మండలంలో అతిపెద్ద చెరువైన యర్రబల్లె చెరువు కట్టకు శనివారం మరమ్మతు లు చేశారు. 0.087 టీఎంసీల సామర్థ్యం కలిగిన యర్రబల్లె చెరువు వర్షంనీటితో పూర్తిస్థాయిలో నిండింది. దీంతో అలుగుపారడంతో ఓ వైపున కట్టపై నీరు ప్రవహించి మట్టి కొట్టుకుపోయింది.

కొట్టుకుపోయిన ప్రాంతంలో శనివారం మట్టిని వేసి మరమ్మతు చేశారు. శనివారం ఓఎస్డీ అనిల్‌ కుమార్‌రెడ్డి, తహసీల్దార్‌ మాధవకృష్ణారెడ్డి కట్ట ను పరిశీలించి పనులు వేగంగా చేయించారు. నల్లపురెడ్డిపల్లె గ్రామస్తులను పునరావాస కేంద్రా నికి తరలించారు. వీఆర్వో ఆంజనేయులు, సిబ్బంది, ప్రజాప్రతినిధు లు పాల్గొన్నారు. 
Updated Date - 2021-11-21T05:43:40+05:30 IST