కిరాణా కొట్టు వ్యాపారిపై హత్యాయత్నం

ABN , First Publish Date - 2021-12-31T05:16:05+05:30 IST

ఎర్రగుంట్ల చౌడేశ్వరీ ఆలయం ఎదురుగా ఉన్న కిరాణా కొట్టు యజమాని ఆరవేటి మల్లికార్జునపై గురువారం రాత్రి హత్యాయత్నం జరిగింది.

కిరాణా కొట్టు వ్యాపారిపై హత్యాయత్నం
చికిత్స పొందుతున్న మల్లికార్జున

ఎర్రగుంట్ల, డిసెంబరు 30: ఎర్రగుంట్ల చౌడేశ్వరీ ఆలయం ఎదురుగా ఉన్న కిరాణా కొట్టు యజమాని ఆరవేటి మల్లికార్జునపై గురువారం రాత్రి హత్యాయత్నం జరిగింది. వివరాల్లోకెళితే... నడివూరుకు చెందిన ఎర్రంరెడ్డి రాజేశ్వరరెడ్డిని వారం రోజుల క్రితం కిరాణా కొట్టు యజమాని నీవు బాగా చదువుకున్నావు కదా ఏదైనా ఉద్యోగం చేసుకోవచ్చు కదా అని సలహా ఇచ్చాడు. దీనిని మనసులో పెట్టుకున్న రాజేశ్వర్‌రెడ్డి పగతీర్చుకోవాలని బుధవారం రాత్రి నిడుజువ్వికి చెందిన మున్నా, మాబువల్లిలకు మద్యం తాగించి మల్లికార్జునపై దాడి చేయించాడు. వారు కత్తితో బలంగా పొడవడంతో తీవ్ర గాయాలయ్యాయి. అతడిని వెంటనే ప్రొద్దుటూరు ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారు. ఈ మేరకు పోలీసుస్టేషన్‌లో ముగ్గురిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. వారిని అదులోకి తీసుకున్నారు. దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

Updated Date - 2021-12-31T05:16:05+05:30 IST