ట్రాన్స్‌పోర్టు నిర్వాహకుడి అరెస్టు

ABN , First Publish Date - 2021-08-26T04:56:12+05:30 IST

నిషేధిత గుట్కా రవాణాకు సహకరించిన ట్రాన్స్‌పోర్టు నిర్వాహకుడిని అరెస్టు చేసి అతడి నుంచి రూ.75 వేల విలువ చేసే గుట్కా బండిల్స్‌ను విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు బుధవారం సీజ్‌ చేశారు.

ట్రాన్స్‌పోర్టు నిర్వాహకుడి అరెస్టు
గుట్కా బండిల్స్‌తో విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు

రూ.75 వేల విలువ చేసే గుట్కా బండిల్స్‌ సీజ్‌

ప్రొద్దుటూరు క్రైం, ఆగస్టు 25 : నిషేధిత గుట్కా రవాణాకు సహకరించిన ట్రాన్స్‌పోర్టు నిర్వాహకుడిని అరెస్టు చేసి అతడి నుంచి రూ.75 వేల విలువ చేసే గుట్కా బండిల్స్‌ను విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు బుధవారం సీజ్‌ చేశారు. ఈ వివరాలను విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆర్‌.పురుషోత్తంరాజు వెల్లడించారు. విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అడిషినల్‌ ఎస్పీ ఉమామహేశ్వర్‌కు వచ్చిన సమాచారంతో బుధవారం స్థానిక శ్రీరాములపేటలోని రాఘవేంద్ర టాన్స్‌పోర్టు వద్ద నిషేధిత గుట్కా బండిల్స్‌ ఉండగా, వాటిని సీజ్‌ చేయడంతో పాటు ట్రాన్స్‌పోర్టు నిర్వాహకుడు తల్లం రాఘవేంద్రను అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు. ఇవి హైదరాబాదు బేగంపేట నుంచి ఈ ట్రాన్స్‌పోర్టుకు శ్రీను, అంజి, పీఆర్‌, బీఎ్‌సఆర్‌, రాజే్‌షల పేర్ల మీద వచ్చాయన్నారు. వీరిపై తదుపరి క్రిమినల్‌ చర్యల నిమిత్తం మూడో పట్టణ పోలీసులకు కేసును అప్పగించినట్లు తెలిపారు. తనిఖీల్లో ఎస్‌ఐ రంగస్వామి, సిబ్బంది సునీల్‌కుమార్‌, హరినాధ్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2021-08-26T04:56:12+05:30 IST