కోడిపందెం రాయుళ్ల అరెస్టు

ABN , First Publish Date - 2021-05-31T05:05:07+05:30 IST

మండలంలోని పి.వెంకటాపురం గ్రామంలో ఏడుగురు కోడిపందెం రాయుళ్లను అరెస్టు చేసినట్లు ఎస్‌ఐ తులసీనాగప్రసాద్‌ తెలిపారు.

కోడిపందెం రాయుళ్ల అరెస్టు

కమలాపురం(రూరల్‌), మే 30: మండలంలోని పి.వెంకటాపురం గ్రామంలో ఏడుగురు కోడిపందెం రాయుళ్లను అరెస్టు చేసినట్లు ఎస్‌ఐ తులసీనాగప్రసాద్‌ తెలిపారు. కోడిపందెం ఆడుతున్నట్లు సమాచారం రావడంతో ఆదివారం తమ సిబ్బందితో వెళ్లి దాడి చేసి పట్టుకున్నామన్నారు. వారి నుంచి రూ.6,300 నగదు, మూడు స్కూటర్లు, ఒక కోడిపుంజును స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేశామని తెలిపారు. 

Updated Date - 2021-05-31T05:05:07+05:30 IST