నలుగురు మట్కాబీటర్ల అరెస్టు
ABN , First Publish Date - 2021-09-04T04:58:12+05:30 IST
ఒకటవ పట్టణ పోలీ్‌స్టేషన్ పరిధి రామేశ్వరంలో ఆరుగురు వ్యక్తులు మట్కా కార్యకలాపాలకు పాల్పడుతుండగా సీఐ నాగరాజు నేతృత్వంలో పోలీసులు దాడి చేసి నలుగురిని పట్టుకోగా, ఇద్ద రు పరారీ అయ్యారు.

ప్రొద్దుటూరు క్రైం, సెప్టెంబరు 3 : ఒకటవ పట్టణ పోలీ్‌స్టేషన్ పరిధి రామేశ్వరంలో ఆరుగురు వ్యక్తులు మట్కా కార్యకలాపాలకు పాల్పడుతుండగా సీఐ నాగరాజు నేతృత్వంలో పోలీసులు దాడి చేసి నలుగురిని పట్టుకోగా, ఇద్ద రు పరారీ అయ్యారు. పట్టుబడిన వారి నుంచి రూ.31,2 50లు నగదు, మట్కా పట్టీలను స్వాధీనం చేసుకున్నట్లు శుక్రవారం సీఐ నాగరాజుతెలిపారు. పట్టుబడిన వారిలో సయ్యద్ ఖాదర్ అలియాస్ ఖదీర్, వెంకటసుబ్బయ్య, ఓబులేసు, క్రిష్ణలు ఉన్నారన్నారు. సమావేశంలో ఏఎ్‌సఐ ఇబ్రహీం, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
మరోచోట నలుగురు ..
ప్రొద్దుటూరు రెండవ పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధి శ్రీనివాసనగర్‌లో మట్కా జూదానికి పాల్పడుతున్న నలుగురు బీటర్లను ఎస్‌ఐ రెడ్డి సురేష్ తన సిబ్బందితో కలిసి అరెస్టు చేశారు. వారి నుంచి రూ. 43,300లు నగదు, మట్కా పట్టీలను స్వాధీనం చేసుకున్నారు. సీఐ నరసింహారెడ్డికి రాబడిన సమాచారంతో మట్కా కార్యకలాపాలకు పాల్పడుతున్న గన్నాతో పాటు చిన్నమాబు, అబ్దుల్ జబ్బార్, శ్రీనివాసులు అనే వారిని అరెస్టు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. కేసు నమోదు చేసినట్లు చెప్పారు.