శాప్‌ డైరెక్టర్‌గా డానియల్‌ ప్రదీప్‌ నియామకం

ABN , First Publish Date - 2021-10-19T05:02:09+05:30 IST

స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ (శాప్‌) డైరెక్టర్‌గా కడప నగరానికి చెందిన యన్‌.డానియల్‌ ప్రదీప్‌ నియమితులయ్యారు.

శాప్‌ డైరెక్టర్‌గా డానియల్‌ ప్రదీప్‌ నియామకం

కడప(మారుతీనగర్‌), అక్టోబరు 18: స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ (శాప్‌) డైరెక్టర్‌గా కడప నగరానికి చెందిన యన్‌.డానియల్‌ ప్రదీప్‌ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో విజయవాడ శాప్‌ కార్యాలయంలో ఆయన బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా శాప్‌ చైర్మన్‌ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి డానియల్‌ ప్రదీ్‌పను అభినందించారు. రాష్ట్రంలో క్రీడలను ప్రభుత్వం ఎంతగానో ప్రోత్సహిస్తున్నదని, అందుకు అనుగుణంగా క్రీడల అభివృద్దికి బాటలు వేయాలన్నారు. కాగా తనపై విశ్వాసంతో అప్పగించిన బాధ్యతను వమ్ముచేయకుండా అంకితభావంతో క్రీడల పురోభివృద్ధికి పాటుపడతానని ప్రదీప్‌ వెల్లడించారు. 


 

Updated Date - 2021-10-19T05:02:09+05:30 IST