కొవిడ్‌ పరిహారానికి దరఖాస్తు చేసుకోండి

ABN , First Publish Date - 2021-11-06T05:11:33+05:30 IST

కొవిడ్‌ మృతుల కుటుంబాలు పరిహారం కోసం దరఖాస్తు చేసుకోవాలని తహసీల్దార్‌ రమణారెడ్డి పేర్కొన్నా రు.

కొవిడ్‌ పరిహారానికి దరఖాస్తు చేసుకోండి
విలేకులతో మాట్లాడుతున్న తహసీల్దార్‌ రమణారెడ్డి

గోపవరం, నవంబరు 5: కొవిడ్‌ మృతుల కుటుంబాలు పరిహారం కోసం దరఖాస్తు చేసుకోవాలని తహసీల్దార్‌ రమణారెడ్డి పేర్కొన్నా రు. శుక్రవారం తహసీల్దార్‌ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కరోనా మృతులకు ప్రభుత్వం రూ.50 వేలు పరిహా రం ప్రకటిచిందని ఇందు కోసం మృతుల కుటుంబ సభ్యులు దరఖా స్తు చేసుకోవాలన్నారు. కొవిడ్‌తో మృతిచెందిన వారి పూర్తి వివరాలతో ఈ నెల 8వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. 

వేముల, నవంబరు 5: మండలంలో కరోనాతో చనిపోయిన వారి కుటుంబాలు ప్రభుత్వ పరిహారం కోసం దరఖాస్తు చేసుకోవాలని తహసీల్దార్‌ నరసింహులు తెలిపారు. దరఖాస్తుదారులు చేసుకోవాల ని, రెవెన్యూ అధికారులను సంప్రదించాలని ఒక ప్రకటనలో కోరారు.

Updated Date - 2021-11-06T05:11:33+05:30 IST