రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలి

ABN , First Publish Date - 2021-03-23T04:28:15+05:30 IST

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చేయాలని రైతు సంఘాల సమన్వయ కమిటీ డిమాం డ్‌ చేసింది.

రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలి
జమ్మలమడుగు జీపుజాతాలో మాట్లాడుతున్న నేతలు

జమ్మలమడుగు రూరల్‌, మార్చి 22: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చేయాలని రైతు సంఘాల సమన్వయ కమిటీ డిమాం డ్‌ చేసింది.  కడపలో ప్రారంభమైన భారత్‌ బంద్‌ ప్రచారజాత సోమవారం జమ్మలమడుగు పట్టణానికి చేరుకుంది. ఈ సందర్భంగా జీపుజాతా బృందం మాట్లాడుతూ రైతు ఉద్యమాలపై బీజేపీ విషప్రచారం చేస్తోందని వాటిని తిప్పికొట్టేందుకు వామపక్షాలు అండగా నిలుస్తాయన్నారు. బీజేపీ ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ చట్టాల వలన రైతులకు గిట్టుబాటు ధర రాదని, వినియోగదారులపై భారం పడుతుందన్నారు.  రైతులందరికి చట్టబద్ధమైన హక్కుగా ఎంఎ్‌సడీని తీసుకురావాలన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలని, కడప ఉక్కు ప్రభుత్వరంగంలో నిర్మించాలని, పెంచిన పెట్రోలు, డీజిల్‌ ధరలు తగ్గించాలని వారు డిమాండ్‌ చేశారు.  కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శులు దస్తగిరిరెడ్డి, చంద్ర, సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు శివనారాయణ, సీఐటీయూ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులరెడ్డి, డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి శివకుమార్‌, మద్దిలేటి, బషీరున్నీసా, దాసు పాల్గొన్నారు.

ఎర్రగుంట్లలో..

ఎర్రగుంట్ల, మార్చి 22 : రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలని రైతు సంఘం జిల్లా కార్యదర్శి చంద్ర డిమాండ్‌ చేశారు. ఈనెల 26న జరిగే బారత్‌ బంద్‌ను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.  ఎర్రగుంట్లకు సోమవారం చే రుకున్న జీపుజాతాలో ఆయన  మాట్లాడుతూ  పెట్రోల్‌, డీజల్‌, గ్యాస్‌, నిత్యావసర సరుకుల ధరలను తగ్గించాలని డిమాండ్‌ చేశారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను తక్షణం ఆపాలన్నారు. కడప ఉక్కు పరిశ్రమ ప్రభత్వమే ఏర్పాటు చే యాలన్నారు. కార్యక్రమంలో ఏఐటీయుసీ, సీపీఐ, సీపీఎం నాయకులు మద్దిలే టి, దస్తగిరెడ్డి, ఎంవీసుబ్బారెడ్డి, నారాయణ, చాంద్‌బాషా, బయన్న పాల్గొన్నారు. 

భారత్‌ బంద్‌ విజయవంతం చేయాలి

ప్రొద్దుటూరు అర్బన్‌, మార్చి 22 : దేశంలో నిరంకుశ ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈనెల 26న జరుపతలపెట్టిన భారత్‌ బంద్‌ను విజయవంతం చేయాలని రైతు సంఘాల నేతలు చంద్రా, శివారెడ్డి సుబ్బారెడ్డిలు పిలుపు నిచ్చారు. సోమవారం  ప్రొద్దుటూరులోని పుట్టపర్తి సర్కిల్‌  జీపుజాతా  కార్యక్ర మంలో వారు మాట్లాడుతూ అన్నదాతలకు గొడ్డలి పెట్టులాంటివి ప్రధాని  మోదీ తెచ్చిన వ్యవసాయ చట్టాలని ధ్వజమెత్తారు. బ్యాంకుల ప్రైవేటీకరణతో ఆర్ధిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తున్నారన్నారు. కార్యక్రమంలోమహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి బసిరున్నీసా, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి సుబ్బరాయుడు, జిల్లా ఉపాధ్యక్షుడు మద్దిలేటి, సీఐటీయూ జిల్లా కార్యదర్శి శ్రీనివాసరెడ్డి, సీపీఎం పట్టణ కార్యదర్శి సత్యం, సాల్మన్‌, విజయ్‌కుమార్‌, సీపీఐ నేతలు శివారెడ్డి మచ్చాశ్రీను తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-23T04:28:15+05:30 IST