అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి

ABN , First Publish Date - 2021-07-13T05:02:58+05:30 IST

అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కోరుతూ సోమవారం స్థానిక సీడీపీఓ కార్యాలయం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.

అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి
ధర్నా నిర్వహిస్తున్న అంగన్వాడీలు

బద్వేలు, జూలై12: అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కోరుతూ సోమవారం స్థానిక  సీడీపీఓ కార్యాలయం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి కె.నాగేంద్రబాబు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తాను అధికారంలోకి రాగానే అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని చెప్పిన మాట నిలబెట్టుకోవాలన్నారు. అలాగే ఐసీడీఎ్‌సకు సరిపడా బడ్జెట్‌ను  కేటాయించాలని, క రోనాతో మరణించిన అంగన్వాడీ వర్క ర్లు, హెల్పర్లకు గరీబ్‌ కళ్యాణ్‌ యోజన కింద రూ.50లక్షల బీమా సౌకర్యం కల్పించి వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, రిటైర్మెంట్స్‌ బెనిఫిట్స్‌ కింద రూ.3లక్షలు ఇవ్వాలని, మిని వర్కర్స్‌ను అంగన్వాడీలుగా, హెల్పర్స్‌కు మినీ అంగన్వాడీలుగా ప్రమోషన్లు ఇవ్వాలని కోరారు.  ఈమేరకు సీడీపీఓ సునందకు వినతిపత్రం అందించారు.  సీఐటీయూ జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాసులు, నాయకులు రమణ, ప్రజాతంత్ర యువజన సమాఖ్య జిల్లా నాయకులు ప్రవీణ్‌కుమార్‌, మండల అధ్యక్ష, కార్యదర్శులు హుసేనమ్మ, కేవీ సుభాషిణి, తదితరులు పాల్గొన్నారు.


పోరుమామిళ్లలో...

అంగన్వాడీ వర్కర్లకు కనీస వేతనంగా రూ.21వేలు అమలు చేసి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యుడు భైరవ ప్రసాద్‌ పేర్కొన్నారు. సోమవారం స్థానిక ఐసీడీఎస్‌ కార్యాలయంలో ఏపీ అంగన్వాడీ వర్కర్స్‌ హెల్పర్స్‌ అండ్‌ మినీ అంగన్వాడీ వర్కర్ల సమస్యలపై ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐసీడీఎ్‌సను నిర్వీర్యం చేయడానికి నూతన విద్యావిధానం తీసుకురావడం దుర్మార్గమన్నారు. దీని వల్ల గర్భిణులు, బాలింతలకు పౌష్ఠికాహారం అందకుండా పోతుందన్నారు.కార్యక్రమంలో ఐసీడీఎస్‌ ప్రాజెక్టు అధ్యక్ష కార్యదర్శులు మేరీ, వినోదాదేవి, విజయమ్మ. ఫక్కీరమ్మ, వాణి, రమాదేవి, శ్రీదేవి, అరుణ పాల్గొన్నారు.


Updated Date - 2021-07-13T05:02:58+05:30 IST