అంగన్వాడీ, మినీ అంగన్వాడీ, ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకోండి

ABN , First Publish Date - 2021-11-27T05:04:30+05:30 IST

రాయచోటి ఐసీడీఎస్‌ ప్రాజెక్టు పరిధిలోని సుండుపల్లె, సంబేపల్లె, చిన్నమండెం, రాయచోటి మండలాల్లో ఖాళీగా ఉన్న అంగన్వాడీ, మినీ అంగన్వాడీ, ఆయా పోస్టులకు డిసెంబరు 1వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని ఐసీడీఎస్‌ సీడీపీవో వసంతాభాయి శుక్రవారం ఒక ప్రకటనలో తెలియజేశారు.

అంగన్వాడీ, మినీ అంగన్వాడీ, ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకోండి

 ఐసీడీఎస్‌ సీడీపీవో వసంతాభాయి

రాయచోటిటౌన్‌, నవంబరు26: రాయచోటి ఐసీడీఎస్‌ ప్రాజెక్టు పరిధిలోని సుండుపల్లె, సంబేపల్లె, చిన్నమండెం, రాయచోటి మండలాల్లో ఖాళీగా ఉన్న అంగన్వాడీ, మినీ అంగన్వాడీ, ఆయా పోస్టులకు డిసెంబరు 1వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని ఐసీడీఎస్‌ సీడీపీవో వసంతాభాయి శుక్రవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ప్రాజెక్టు పరిధిలోని 7 అంగన్వాడీ పోస్టులు,2 మినీ అంగన్వాడీ పోస్టులు, 19 ఆయా పోస్టులు ఖాళీలు ఉన్నాయన్నారు. అందులో 7 అంగన్వాడీ పోస్టులకు గానూ సుండుపల్లె మండలంలో మిట్టబిడి కి (ఎస్టీ), కంచిపాటివాండ్లపల్లె (బీసీ), కొండలతూర్పు (ఎస్సీ), సాయన్నగారిపల్లె (ఓసీ)లుగా రిజర్వేషన్లు కల్పించారని తెలిపారు. అలాగే సంబేపల్లె మండలంలో అగ్రహారం (ఓహెచ్‌), దేవపట్ల-2(ఓసీ), రాయచోటి మున్సిపాలిటీలోని చర్చి వీధి (ఎస్సీ)లకు కేటాయించారని చెప్పారు. అలాగే మినీ అంగన్వాడీ పోస్టులకు గానూ సుండుపల్లె మండలంలో టిక్కెం హరిజనవాడ (ఎస్సీ), రాయచోటి మండలంలో వడ్డిపల్లె (ఓహెచ్‌)లుగా రిజర్వేషన్‌ కల్పించారని తెలియజేశారు. అంతేగాక ఆయా పోస్టులకు గానూ సుండుపల్లె మండలంలో ముడుంపాడు (బీసీ-ఈ), ఎం.కుర్వపల్లె (బీసీ-బీ), చిన్నగొల్లపల్లె (బీసీ-సీ), దిగువపల్లె (బీసీ-సీ), బీజీరాచపల్లె (ఓసీ), రాయవరం-2 (ఓసీ), పాపన్నగారిపల్లె (ఓహెచ్‌), సంబేపల్లె మండలంలో దేవపట్ల-2(బీసీ-ఏ), కట్టుగుత్తపల్లె (బీసీ-డీ), శెట్టిపల్లె-1 (ఎస్సీ), రాయచోటి మున్సిపాలిటీలో మేదరవీధి (బీసీ-ఈ), సుబ్బారెడ్డివీధి (ఈడబ్ల్యూఎస్‌), పూజారిబండ (ఎస్టీ), చిన్నమండెం మండలంలో కుమ్మరపల్లె (ఎస్టీ), వైజీవీపల్లె (బీసీ-డీ), జల్లావాండ్లపల్లె (ఓహెచ్‌), చాకిబండ-2 (ఓహెచ్‌), రాయచోటి మండలంలో దిగువ అబ్బవరం (బీసీ-డీ), చెన్నముక్కపల్లె (ఎస్టీ)లుగా రిజర్వేషన్లు కేటాయించినట్లు ఆమె తెలియజేశారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 1-7-2021 సంవత్సరం నాటికి 21 సంవత్సరాలు పైబడి 35 సంవత్సరాలలోపు వయస్సు కలిగి స్థానికులై వివాహితులై ఉండాలన్నారు. అలాగే అంగన్వాడీ, మినీ అంగన్వాడీ, ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారు పదో తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలని సూచించారు.దరఖాస్తులను డిసెంబరు నెల 1వ తేదీ సాయంత్రం 5 గంటలలోగా ఐసీడీఎస్‌ కార్యాలయంలో అందజేయాలన్నారు. 

రామాపురం..: మండల పరిధిలోని ఒక అంగన్వాడీ వర్కర్‌, 6 ఆయా పోస్టులకు డిసెంబరు 1వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని మండల ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ తులసమ్మ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మండలంలోని కుమ్మరపల్లె పంచాయతీ మన్నేరువాండ్లపల్లెలో వర్కర్‌ పోస్టు, చిట్లూరు పంచాయతీ ఏకిలపల్లెలో ఆయా పోస్టు (ఓహెచ్‌), హసనాపురం పంచాయతీ చీకటివాండ్లపల్లె (బీసీ-ఏ), నల్లగుట్టపల్లె పంచాయతీ రామాపురం (ఎస్సీ), సరస్వతిపల్లె (ఓహెచ్‌), కల్పనాయునిచెరువు పంచాయతీ మూలపల్లెలో ఎస్టీలకు కేటాయించినట్లు ఆమె తెలిపారు. డిసెంబరు 1వ తేదీలోపు లక్కిరెడ్డిపల్లె శిశు సంక్షేమశాఖ అధికారి కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలన్నారు. 


Updated Date - 2021-11-27T05:04:30+05:30 IST