ఆంధ్రరాష్ట్ర పిత అమరజీవి : కాంగ్రెస్‌

ABN , First Publish Date - 2021-12-16T04:40:43+05:30 IST

ఆంధ్ర రాష్ట్ర పిత అమరజీవి పొట్టి శ్రీరాములు అని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డి అన్నారు.

ఆంధ్రరాష్ట్ర పిత అమరజీవి : కాంగ్రెస్‌
వేంపల్లెలో పొట్టిశ్రీరాములుకు నివాళులు అర్పిస్తున్న తులసిరెడ్డి

వేంపల్లె, డిసెంబరు 15: ఆంధ్ర రాష్ట్ర పిత అమరజీవి పొట్టి శ్రీరాములు అని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డి అన్నారు. ప్రత్యేక రాష్ట్రం కావాలని ప్రాణత్యాగం చేసిన దివంగత పొట్టిశ్రీరాములు త్యాగశీలిని కొని యాడారు. పొట్టిశ్రీరాములు వర్ధంతిని పుర స్కరించుకుని వేంపల్లెలో ఘననివాళుల ర్పించిన ఆయన మాట్లాడుతూ పొట్టి శ్రీరా ములు ఆత్మార్పణ ఫలితంగా తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రరాష్ట్రం ఏర్పడింద న్నారు. జగన్‌ ప్రభుత్వం ఆంగ్లప్రదేశ్‌, మ ద్యాంధ్ర ప్రదేశ్‌గా మార్చాలనడం శోచనీయం.

కాశినాయనలో....

భాషా ప్రయుక్త రాష్ట్రా ల పితామహుడు పొట్టి శ్రీరాములు మహనీయుడని పిట్టిగుంట ప్రభుత్వ ప్రాధమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నారాయణస్వామి పేర్కొన్నారు. పొట్టి శ్రీరాములు వ ర్ధంతిలో ఉపాధ్యాయులు రమణారెడ్డి, అరుణ, తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.

మైదుకూరులో....

అమరజీవి పొట్టి శ్రీరా ములు వర్ధంతిని మైదుకూరులో ఘనంగా నిర్వహించారు. ఆర్యవైశ్య సంఘాల ఆధ్వ ర్యంలో అమ్మవారిశాలలో ఆయన చిత్రప టం వద్ద నివాళులర్పించారు. మార్కెట్‌ కూ డలిలో ఉన్న ఆయన విగ్రహం వద్ద  ఆర్యవైశ్య నేతలు పాల్గొన్నారు.

బి.మఠంలో.... 

స్థానిక కన్యకాపరమేశ్వరి అమ్మవారిశాలలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వ ర్యంలో పొట్టిశ్రీరాములు వర్ధంతి నిర్వహిం చారు. వైశ్యవారధి కె.సాంబశివరావు సహకారంతో అవోపా అధ్యక్షుడు ముచ్చర ్ల శేషయ్య, కోశాధికారి బింది సూర్యనారాయణ, కార్యద ర్శి సురేష్‌, ఆర్యవైశ్యసంఘం కమిటీ సభ్యుల ఆర్థిక సహాయంతో పేద ఆర్యవైశ్య సభ్యుల కు ఆర్థికసాయాన్ని అందజేశారు. సుంకు సురేష్‌, బి.సురేష్‌, బి.సుధాకర్‌, బి.సుధాకర్‌, అమరావతి బ్రహ్మం, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

బద్వేలులో....

పొట్టి శ్రీరాములు జీవితం నేటితరానికి ఆదర్శమని చిన్నకేశంపల్లె ఉన్న త పాఠశాల ప్రధానోపాధ్యాయులు రమణ య్య పేర్కొన్నారు. పొట్టిశ్రీరాములు వర్థంతిని పురస్కరించుకుని పాఠశాలలో ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. 

ఖాజీపేటలో....

ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణాన్ని అర్పించి తెలుగుజాతికి ప్రత్యేక గుర్తింపు తెచ్చిన పొట్టి శ్రీరాములు అమరజీవి అయ్యారని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడి ్డ పేర్కొన్నారు. పొట్టి శ్రీరాములు వర్ధంతిని దుంపలగట్టులోని ఆయన స్వగృహంలో చేశారు. 

Updated Date - 2021-12-16T04:40:43+05:30 IST