రాతిగుండు కింద పురాతన వినాయకుడి విగ్రహం

ABN , First Publish Date - 2021-08-22T04:33:19+05:30 IST

మండల కేంద్రానికి దక్షిణ భాగంలో నల్లకొండలో వడ్డెరలు రాతి గుండును పగలకొట్టుతుండగా దాని కింద చిన్నపాటి పురాతన వినాయకు ని రాతి విగ్రహం బయట పడింది.

రాతిగుండు కింద పురాతన వినాయకుడి విగ్రహం
రాతి గుండుకింద బయటపడ్డ పురాతన వినాయకుడి విగ్రహం, ప్రమిదలు

సంబేపల్లె, ఆగస్టు21: మండల కేంద్రానికి దక్షిణ భాగంలో నల్లకొండలో వడ్డెరలు రాతి గుండును పగలకొట్టుతుండగా దాని కింద  చిన్నపాటి పురాతన వినాయకు ని రాతి విగ్రహం బయట పడింది. శుక్రవారం విగ్రహంతో పాటు పురాతన కాలంలో చిన్నపాటి కుండలు, దీపపు ప్రమిదలు ఒకేచోట బయటపడ్డాయి. రాళ్లు కొట్టే వ్యక్తి  వీటిని గుండు కింద పెట్టి ఇంటికి వెళ్లిపోయాడు. కాగా రాత్రి వినాయకుడు అతనికి స్వప్నంలో కనిపించి పూజలు చేయమని చెప్పడంతో శనివారం నుండి అక్కడ పూజలు చేపట్టారు. ప్రజలు విషయం తెలుసుకున్న ప్రజలు భారీ సంఖ్యలో అక్కడి చేరుకుని పూజలు నిర్వహించారు. 

Updated Date - 2021-08-22T04:33:19+05:30 IST