జగన్‌ ప్రభుత్వంలో రోడ్లన్నీ గుంతలమయం

ABN , First Publish Date - 2021-07-25T04:44:21+05:30 IST

జగన్‌ ప్రభుత్వం అఽఽధికారంలో వచ్చిన తరువాత జిల్లాలో రోడ్లన్నీ గుంతలమమయ్యాయి.

జగన్‌ ప్రభుత్వంలో రోడ్లన్నీ గుంతలమయం
రోడ్డుకు మరమ్మతులు చేస్తున్న లింగారెడ్డి, అమీర్‌బాబు, శివకొండారెడ్డి

టీడీపీ నాయకుల వినూత్న నిరసన


కడప, జూలై 24 (ఆంధ్రజ్యోతి): జగన్‌ ప్రభుత్వం అఽఽధికారంలో వచ్చిన తరువాత జిల్లాలో రోడ్లన్నీ గుంతలమమయ్యాయి. రెండేళ్ల పాలనలో పాదచారులు నడిచే వీలు లేకుండా రహదారులు తయారయ్యాయి. దెబ్బతిన్న రోడ్లను మరమ్మతులు చేసేందుకు ప్రభుత్వం పైసా కూడా నిధులు విడుదల చేయలేదని టీడీపీ కడప పార్లమెంటు అధ్యక్షుడు ఎం.లింగారెడ్డి, కడప అసెంబ్లీ ఇన్‌ఛార్జ్‌ అమీర్‌బాబు ఆరోపించారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పిలుపు మేరకు శనివారం మద్రాసు రోడ్డులోని చిన్నచౌకు పోలీసుస్టేషన్‌ ఎదురుగా దెబ్బతిన్న రోడ్డుకు మరమ్మతులు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్‌ అస్తవ్యస్త పాలనతో రాష్టా్ట్రన్ని దివాళా తీయించారన్నారు. ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టి అప్పులు తీసుకునే పరిస్థితి తయారైందన్నారు. రోడ్లు దెబ్బతిని జనం ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. టీడీపీ హయాంలో రహదారుల అభివృద్ధికి కోట్లాది రూపాయల నిధులు కేటాయించినా వాటిని ఉపయోగించులేకపోయిందన్నారు. కార్యక్రమంలో నగర అధ్యక్షుడు శివకొండారెడ్డి, ప్రఽధాన కార్యదర్శి జయకుమార్‌, అన్వర్‌హుసేన్‌, బద్వేలు టీడీపీ నాయకులు రాజశేఖర్‌, మహిళా నాయకురాలు సుబ్బలక్షుమ్మ, తుమ్మలపాటి శివశంకర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-07-25T04:44:21+05:30 IST