మద్యం తాపి.. మర్మాంగంలో కడ్డీ దూర్చి....
ABN , First Publish Date - 2022-01-01T05:27:10+05:30 IST
మద్యం తాపి మర్మాంగంలో కడ్డీ దూర్చి... అమానుషంగా ప్రవర్తించిన సంఘటన బి మఠం మండలంలో చోటుచే సుకుంది.

మైదుకూరు, డిసెంబరు 31: మద్యం తాపి మర్మాంగంలో కడ్డీ దూర్చి... అమానుషంగా ప్రవర్తించిన సంఘటన బి మఠం మండలంలో చోటుచే సుకుంది. సంఘటనపై పోలీ సులు అందించిన వివరాల్లో కెళితే... దువ్వూరు మండలం చింతకుంటకు చెందిన మ హ్మద్‌బాష కుటుంబం క ర్నూలు జిల్లా చాగలమర్రి లో నివాసముంటున్నారు. కాగా మహ్మద్‌బాష మైదుకూరులో ఓ లారీ ఓనర్ వద్ద డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.
ఈ క్రమంలో మైదుకూరు లోని ఓ పెట్రోల్ బంకు వద్ద తీవ్ర రక్తస్రా వంతో అనుమానాస్పా స్థితిలో పడి ఉన్న మహ్మద్‌బాషను కొందరు గుర్తించి పోలీ సుల కు సమాచారం అందించారు. 108 వాహనం ద్వారా కడపకు పంపగా, మె రుగైన చికిత్స నిమిత్తం తిరు పతికి తరలించారు.
సంఘ టనలో మరోకోణంలో అంది న సమాచారం మేరకు కొం దరు వ్యక్తులతో కలసి మ హ్మద్ బాషను బి మఠం మండలంలోని ఓ ప్రాంతం లోకి తీసుకెళ్లి మద్యం తాపి మర్మాంగంలో ఇనుప కడ్డీని దూర్చారని తెలుస్తోంది. అత న్ని తీసుకొచ్చి పెట్రోల్ బంకు వద్ద పడేసినట్లు తెలిసింది. కాగా ఈ ఘటన వివాహేతర సం బంధంగా జరిగి ఉండవచ్చనే ఆరోపణలున్నా యి. ఈ విషయం పోలీసుల విచారణలో తెలి యాల్సింది. బాధితుని నుంచి ఫిర్యాదు రాలే దని బి.మఠం, మైదుకూరు పోలీసులు తెలిపారు.