ఎండీఎంలో నాణ్యత లోపిస్తే చర్యలు
ABN , First Publish Date - 2021-12-16T04:54:09+05:30 IST
మధ్యాహ్న భోజనంలో నాణ్యత లోపిస్తే చర్యలు తప్పవని డీఈఓ పి.శైలజ హెచ్చరించారు. కడప నగరం శాంతినగర్‌లోని ఎంపీపీ పాఠశాలను బుధవారం ఆమె ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

డీఈవో శైలజ
కడప(ఎడ్యుకేషన్), డిసెంబరు 15: మధ్యాహ్న భోజనంలో నాణ్యత లోపిస్తే చర్యలు తప్పవని డీఈఓ పి.శైలజ హెచ్చరించారు. కడప నగరం శాంతినగర్‌లోని ఎంపీపీ పాఠశాలను బుధవారం ఆమె ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రతి విద్యార్థికి పోషక విలులతో కూడిన ఆహారాన్ని అందించాలనే లక్ష్యంతోనే ప్రభుత్వం కోట్ల రూపాయలతో ఈ పథకాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారని, ఎవరైనా అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని సూచించారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.