ప్రశాంతతకు భంగం కలిగిస్తే చర్యలు

ABN , First Publish Date - 2021-02-02T04:56:12+05:30 IST

గ్రామ పంచాయతీ ఎన్నికల దృష్ట్యా జమ్మలమడుగు సబ్‌డివిజన్‌ పరిధిలోని గ్రామాల్లో ప్రశాంత వాతావరణానికి ఎవరైనా సరే భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ నాగరాజు పేర్కొన్నారు.

ప్రశాంతతకు భంగం కలిగిస్తే చర్యలు
జమ్మలమడుగులో మాట్లాడుతున్న డీఎస్పీ నాగరాజు

జమ్మలమడుగు రూరల్‌, ఫిబ్రవరి 1: గ్రామ పంచాయతీ ఎన్నికల దృష్ట్యా జమ్మలమడుగు సబ్‌డివిజన్‌ పరిధిలోని గ్రామాల్లో ప్రశాంత వాతావరణానికి ఎవరైనా సరే భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ నాగరాజు పేర్కొన్నారు. సోమవారం జమ్మలమడుగు డీఎస్పీ కార్యాలయం ఆవరణలో సబ్‌డివిజన్‌ పరిధిలోని పోలీసు అధికారులకు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా పోలీసు అధికారుల ఆదేశాల మేరకు గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలి పారు.  జమ్మలమడుగు ప్రాంతంలో నాలుగవ దఫా ఎన్నికలు జరుగనున్నాయని అందులో భాగంగా గ్రామాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు పోలీసు అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటోందన్నారు. సమస్యాత్మక గ్రామాల్లో ప్రత్యేక నిఘా ఉంటుందన్నారు. బలవంతంగా రాజీలు చేయడం, ఇతరత్రా సమస్యలు సృష్టిస్తే కేసులు తప్పవన్నారు. ఇందుకు సంబందించి సబ్‌డివిజన్‌ పరిధిలోని పోలీసుల అధికారులకు డీఎస్పీ నాగరాజు సూచనలు, సలహాలు అందించారు. ఈ కార్యక్రమంలో సబ్‌డివిజన్‌ పరిధిలోని ఎస్‌ఐలు, సీఐలు పాల్గొన్నారు.

భయబ్రాంతులకు గురిచేస్తే చర్యలు తప్పవు

ప్రొద్దుటూరు రూరల్‌, ఫిబ్రవరి 1: సర్పంచ్‌, వార్డు మెంబర్లుగా పోటీచేసే అభ్యర్థులను కానీ ఓటర్లను గానీ భయబ్రాంతులకు గురిచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రూరల్‌ ఎస్‌ఐ రవికు మార్‌ హెచ్చరించారు. మండలంలోని దొరసానిపల్లె, ఉప్పాగు కాలనీల్లో సోమవారం ఆ ప్రాంత ప్రజలకు పోలీసు అధికారులు పలు సూచనలు ఇచ్చారు. ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా చూసేందుకు పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తామ న్నారు. అభ్యర్థులుకానీ, ఓటర్లు కూడా భయానికి గురైతే తనకు సమాచారం అందించిన వెంటనే వారికి పోలీసుల బందోబస్తు నిర్వహిస్తామన్నారు.  కార్యక్రమంలో రూరల్‌ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2021-02-02T04:56:12+05:30 IST