దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి

ABN , First Publish Date - 2021-11-24T05:08:00+05:30 IST

చెమ్ముమియాపేట గ్రేడ్‌-1 వీఆర్వో విజయ భాస్కర్‌రెడ్డిపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవా లని రెవెన్యూ సిబ్బంది డిమాండ్‌ చేశారు. ఈ మేరకు మంగళవారం తహసీల్దారు కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. వారు మాట్లాడుతూ వరద సాయం కింద పేదలకు అందించాల్సిన ప్రభుత్వ సాయం విషయంలో స్థానిక వైసీపీ నేత చెప్పినట్లు వినలేదనే కారణంతో వీఆర్‌ఓపై దాడి చేయడం బాధాకరమన్నారు.

దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి
తహసీల్దారుకు వినతిపత్రం అందజేస్తున్న రెవెన్యూ సిబ్బంది

రెవెన్యూ సిబ్బంది నిరసన, తహసీల్దారుకు వినతి

కడప(కలెక్టరేట్‌), నవంబరు 23: చెమ్ముమియాపేట గ్రేడ్‌-1 వీఆర్వో విజయ భాస్కర్‌రెడ్డిపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవా లని రెవెన్యూ సిబ్బంది డిమాండ్‌ చేశారు. ఈ మేరకు మంగళవారం తహసీల్దారు కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. వారు మాట్లాడుతూ వరద సాయం కింద పేదలకు అందించాల్సిన ప్రభుత్వ సాయం విషయంలో స్థానిక వైసీపీ నేత చెప్పినట్లు వినలేదనే కారణంతో వీఆర్‌ఓపై దాడి చేయడం బాధాకరమన్నారు. ఈ సందర్భంగా వీఆర్వో విజయభాస్కర్‌ రెడ్డి మాట్లాడుతూ వైసీపీ నేతలు చెప్పినట్టు తాను వినలేదని తనపై విచక్షణా రహితంగా దాడి చేశారని, వెంటనే బాధ్యులను అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. లేకపోతే బుధవారం ఆర్డీఓ, కలెక్టరేట్‌ ఎదుట తాము ధర్నా నిర్వహిస్తామని తెలిపారు. అనంతరం కడప తహసీల్దారు శివరామిరెడ్డికి రెవెన్యూ, సచివాలయాల సిబ్బంది వినతిపత్రం అందజేశారు.

Updated Date - 2021-11-24T05:08:00+05:30 IST