ఊపందుకున్న పొలం పనులు

ABN , First Publish Date - 2021-08-22T04:28:19+05:30 IST

గత నెలలో వర్షాలు బాగా కురియడంతో చెరువులు, కుంటల్లో జలకళ సంతరించుకుంది

ఊపందుకున్న పొలం పనులు
వరి నాట్లు వేస్తున్న కూలీలు

వరి నాట్లతో బిజీగా ఉన్న వ్యవసాయ కూలీలు  దుక్కులు, కలుపు మొక్కల తొలగింపుతో తీరికలేని రైతన్నలు

మైలవరం, ఆగస్టు 21: గత నెలలో వర్షాలు బాగా కురియడంతో చెరువులు, కుంటల్లో జలకళ సంతరించుకుంది. దీంతో వరి నారుమళ్లతోపాటు పత్తి, వేరుశనగ పంటలను రైతన్నలు విస్తారంగా సాగుచేస్తున్నారు. ఇప్పటికే చాలా వరకు వరినారు కయ్యలు దుక్కులు దున్ని పొలాలు సిద్ధం చేశారు. వరినాట్లు వేయడంలో వ్యవసాయ కూలీలు బిజీగా ఉన్నారు. మైలవరం మండల పరిధిలోని కట్లట్ల, తలమంచిపట్నం, మైలవరం, వేపరాలతో పాటు పలు గ్రామాల్లో చెరువులు, జలాశయం కింద ఉన్న ఆయకట్లు భూముల్లో  వారం రోజులుగా జోరుగా కూలీలతో వరినాట్లు వేస్తున్నారు. అలాగే పత్తి, కంది, పంటలు సాగు చేసిన రైతులు కలుపునివారణకు సేద్యాలు చేస్తుండగా మరి కొందరూ పురుగుల నివారణకు మందులను పిచికారి చేస్తున్నారు. ఆయకట్టు భూములున్న రైతులు వరి నాటేందుకు వరి కయ్యలను చదునుచేస్తున్నారు. గ్రామాల్లో  పొలం పనుల్లో అటు రైతులు ఇలు రైతు కూలీలు బిజీబిజీగా ఉన్నారు.



Updated Date - 2021-08-22T04:28:19+05:30 IST