నాడు-నేడు పనులు వేగవంతం చేయండి

ABN , First Publish Date - 2021-02-06T05:21:39+05:30 IST

జిల్లాలో ప్రస్తుతం జరుగుతున్న నాడు- నేడు పనులు వేగవంతం చేయాలని ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి కోరారు.

నాడు-నేడు పనులు వేగవంతం చేయండి
జేసీ సాయికాంత్‌వర్మతో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ

- ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి

కడప(ఎడ్యుకేషన్‌), ఫిబ్రవరి 5: జిల్లాలో ప్రస్తుతం జరుగుతున్న నాడు- నేడు పనులు వేగవంతం చేయాలని ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి కోరారు. కడపలోని జాయింట్‌ కలెక్టర్‌ కార్యాలయంలో శుక్రవారం జేసీ సాయికాంత్‌వర్మను కలిసి ఎమ్మెల్సీ వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ప్రత్యేకంగా 30 పాఠశాలలను ఆదర్శ పాఠశాలలుగా గుర్తించి నాడు-నేడుతో అన్ని సౌకర్యాలను కల్పించినందుకు ముందుగా కృతజ్ఞతలు తెలిపారు. కాగా పాఠశాలల్లో పనులకు సంబంధించి బిల్లులు మంజూరు చేయాలని, పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఏర్పడిందని, ఆ ఖాళీలు భర్తీ చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు కంభం బాలగంగిరెడ్డి కోరారు.


ప్రైవేటు కళాశాలల అధ్యాపకులకు జీతాలు చెల్లించాలి

కడప(మారుతీనగర్‌), ఫిబ్రవరి 5: ప్రైవేటు ఇంజనీరింగ్‌ కళాశాలల్లో పనిచేస్తున్న అధ్యాపకులకు సకాలంలో జీతాలు చెల్లించాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు శుక్రవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో పాత్రికేయులతో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 350 ఇంజనీరింగ్‌ కళాశాలలు, 50 వేల మంది అధ్యాపకులు ఉన్నారని, వారికి మూడు నెలలుగా జీతాలు ఇవ్వడంలో కాలయాపన చేస్తున్నారన్నారు. సమావేశంలో ఏపీటీపీఐఈఏ అధ్యక్షుడు ఎం.వి.బ్రహ్మానందరెడ్డి, ఎస్‌టీయూ జిల్లా అధ్యక్షుడు బాలగంగిరెడ్డి పాల్గొన్నారు. 


బ్రౌన్‌ భాషాపరిశోధన కేంద్రం సందర్శన

నగర ఎర్రముక్కపల్లెలోని సి.పి.బ్రౌన్‌ భాషాపరిశోధన కేంద్రాన్ని ఎమ్మెల్సీ నరసింహారెడ్డి సందర్శించారు. ఆయన మాట్లాడుతూ పరిశోధకులకు ఉపయోగపడే గ్రంథాలు ఇక్కడ చాలా ఉన్నాయని, కేంద్రం అభివృద్ధికి తాను సంపూర్ణ సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో గ్రంథాలయ సహాయ పరిశోధకుడు భూతపురి గోపాలక్రిష్ణశాస్త్రి, కేంద్రం బాధ్యుడు మూల మల్లికార్జునరెడ్డి, గ్రంథ పాలకులు రమేష్‌రావు, జి.హరిభూషణ్‌రావు, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-02-06T05:21:39+05:30 IST