విత్తన దుకాణాల ఆకస్మిక తనిఖీ

ABN , First Publish Date - 2021-06-23T05:11:12+05:30 IST

వీరపునాయునిపల్లెలో ఉన్న ఎరువులు, పురుగు మందులు, విత్తన దుకాణాలను వ్యవసాయాధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.

విత్తన దుకాణాల ఆకస్మిక తనిఖీ

వీరపునాయునిపల్లె, జూన్‌ 22: వీరపునాయునిపల్లెలో ఉన్న ఎరువులు, పురుగు మందులు, విత్తన దుకాణాలను వ్యవసాయాధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. మంగళవారం కడప డివిజన్‌ సహాయ వ్యవసాయ సంచాలకులు (ఏడీఏ) నరసింహారెడ్డి, వీరపునాయునిపల్లె మండల వ్యవసాయాధికారి శ్యామ్‌బాబు దుకాణాలను తనిఖీ చేశారు. ఏడీఏ మాట్లాడుతూ రైతులు ఈ దుకాణాలకు వచ్చి కొనుగోలు చేసినపుడు బిల్లులు తప్పకుండా తీసుకోవాలని తెలిపారు. అదేవిధంగా డీలర్లు ఖచ్చితంగా సంబంధిత వివరాలు ఎప్పటికప్పుడు స్టాక్‌ రిజిస్టర్‌లో నమోదు చేసుకోవాలని తెలియజేశారు. నకిలీ విత్తనాలు ఎవరైనా అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అన్ని రకాల నాణ్యమైన ఎరువులను రైతులకు గరిష్ట చిల్లర ధరకే విక్రయించాలని సూచించారు. కార్యక్రమంలో హెడ్‌ కానిస్టేబుల్‌ మోహన్‌రెడ్డి, ఎంపీఈఓలు శివ, బాష తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-23T05:11:12+05:30 IST